RCB Captain Faf Du Plessis hits fifty in practice match ahead of IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దక్షిణాఫ్రికా ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్‌గా తొలి విజయం అందుకున్నాడు. అయితే ఇది అధికారికంగా మాత్రం కాదు. ఐపీఎల్ 2022 సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడిన ప్రాక్టీస్ మ్యాచులో ఫాఫ్ టీమ్ విజయాన్ని అందుకుంది. హర్షల్ పటేల్ ఎలెవన్ టీమ్స్‌తో శుక్రవారం జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో డుప్లెసిస్ ఎలెవన్ 2 పరుగల తేడాతో గెలుపొందింది. మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఆర్‌సీబీ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రాక్టీస్ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఫాఫ్ డుప్లెసిస్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 40 బంతుల్లో 76 పరుగులు చేయాడు. అతడికి తోడుగా విండీస్ హార్డ్ హిట్టర్ రూథర్‌ఫోర్డ్ (59) హాఫ్ సెంచరీ చేయగా..  అనూజ్ రావత్ (46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పేసర్ హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్ కర్ణ్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి. 


అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన హర్షల్ పటేల్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసి.. కేవలం రెండు పరుగుల తేడాతో మాత్రమే ఓడిపోయింది. హర్షల్ జట్టులో యువ ప్లేయర్ సుయేశ్ 46 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ఇక వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ 21 బంతుల్లో 49 పరుగులు బాదాడు. ఇన్నింగ్స్ చివరలో డేవిడ్ విల్లే 17 బంతుల్లో 25 చేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. పేసర్ ఆకాశ్ దీప్‌కు 4 వికెట్లు దక్కాయి. 



అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబందించిన వీడియోను ఆర్‌సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెసన్ బెంగళూరు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మొత్తానికి సన్నాహక మ్యాచుతో ఆర్‌సీబీ బ్యాటర్లు మంచి టచ్‌లోకి వచ్చారు. ఐపీఎల్ 2022 శుక్రవారం ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్ చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య జరగనుంది. ఇక మార్చి 27న పంజాబ్ జట్టుతో బెంగళూరు తలపడనుంది.  


Also Read: IPL 2022: లైవ్‌ జరుగుతుండగానే.. భారత స్టార్ క్రికెట్ కామెంటేటర్‌పై దాడి! చివరికి సూపర్ ట్విస్ట్!!


Also Read: IPL 2022 Captains List: కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై.. ఈసారి నలుగురు కొత్తవారికి సారథ్యం! 10 జట్ల కెప్టెన్‌ల జాబితా ఇదే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook