Dhoni Fan Banner Viral: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానుల్ని అలరించింది. ఓ అభిమాని అయితే..ప్రాణమైనా ఇచ్చేస్తానంటున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రికెట్ ప్రపంచంలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలానే ఉంది. క్రికెట్‌లో ధోనీకే ఫ్యాన్ బేస్ ఎక్కువని ఓ అంచనా. ధోని అంటే ఎంత పిచ్చో అనేది మరోసారి నిరూపితమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమాని..ధోని కోసం ప్రాణాల్నైనా ఇచ్చేస్తానంటున్నాడు.


ఈ అభిమాని మహేంద్ర సింగ్ ధోని కోసం ప్రాణాల్నైనా ఇచ్చేస్తానంటున్నాడు. ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే మధ్య జరిగిన మ్యాచ్‌లో స్డేడియంలో ఓ అభిమాని ప్రదర్శించిన బ్యానర్ వీడియో వైరల్ అవుతోంది. ధోనీ ఒకవేళ స్వర్గానికి వెళ్లి ఆడితే..నేను చావడానికైనా సిద్ధమే అంటూ ఆ బ్యానర్‌లో ప్రదర్శించాడు. ధోని అంటే అభిమానులు పిచ్చోళ్లైపోవడం ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు ధోని అంటే క్రేజ్ చూపించిన పరిస్థితులున్నాయి. ధోనీని చూసేందుకు అభిమానులు ఒక్కోసారి స్డేడియంలోకి బలవంతంగా దూసుకొస్తుంటారు. మరి కొన్నిసార్లు పెద్ద పెద్ద పోస్టర్లు ప్రదర్శిస్తుంటారు. ఇంకొంతమంది తమ శరీరంపై ధోని పేరు, ఫోటోల టాటూలు వేయించుకుంటుంటారు.



మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో సీఎస్కే అద్భుతంగా ప్రదర్శన చేసింది. ఇప్పటివరకూ సీఎస్కే 4 సార్లు ఐపీఎల్ టైటిల్ గెల్చుకుంది. ధోని కెప్టెన్సీలో వరుసగా 2010, 2011లో రెండుసార్లు, తరువాత 2018, 2021లో రెండుసార్లు టైటిల్ గెల్చుకుంది.


Also read: IPL 2022: ఎస్ఆర్‌హెచ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ, సుందర్ మళ్లీ దూరం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.