IPL 2022, Dhoni New Look: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) ఆగస్టు 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. గతేడాది సీఎస్కేను విజేతగా నిలబెట్టడంలో ధోని కీలకపాత్ర పోషించాడు. కొత్త సీజన్ (IPL 2022) మార్చి 26న ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో చెన్నైను మరోసారి విజేతగా నిలబెట్టేందుకు ధోని సిద్ధమయ్యాడు. ముంబై, పుణే వేదికలుగా మ్యాచ్ లు జరగనున్నాయి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తాజాగా ధోని కొత్త లుక్ (Dhoni New Look)లో దర్శనమిచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమోను ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ (Star Sports) రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ధోని ఖాకీ చొక్కా, ప్యాంటు ధరించి..కూలింగ్ గ్లాస్ పెట్టుకుని..మెడలో కర్చీఫ్ కట్టుకుని.. బస్సు డ్రైవర్ గా కనిపించాడు. ధోని నయా లుక్ ఎలా ఉందంటూ స్టార్ స్పోర్ట్స్ ఫ్యాన్స్ అభిప్రాయాలను కోరింది. నెటిజన్స్ నుంచి దీనికి విపరీతమైన స్పందన వస్తోంది. గత సీజన్ ఐపీఎల్ ప్రారంభానికి ముందు కూడా సీఎస్కే కెప్టెన్ ఒక ప్రోమోలో సన్యాసి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. 




ఐపీఎల్ లో చెన్నైసూపర్ కింగ్స్ (Chennai Super Kings)ను నాలుగుసార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు ధోని. వచ్చే సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), గుజరాత్ టైటాన్స్ (GT) అనే రెండు కొత్త ప్రాంచైజీలు రాబోతున్నాయి. దీంతో ఐపీఎల్ లో పోటీపడే జట్ల సంఖ్య 10కి చేరింది. మొత్తం 10 జట్లు 72 మ్యాచ్​లలో తలపడనున్నాయి.


Also Read: IND vs SL 2nd T20I: శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి