IPL 2022: వైరల్ పిక్.. చిరంజీవి హీరోయిన్ను చంకనెత్తుకున్న క్రికెట్ కామెంటర్!!
Danny Morrison lifts Karishma Kotak. ఐపీఎల్ 2013 సందర్భంగా టీవీ షో ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్ సమయంలో డానీ మోరిసన్, కరిష్మా కోటక్ గ్రౌండ్‌లో లైవ్ కామెంట్రీ చేశారు. ఈ సందర్భంగా కరిష్మాను డానీ ఒక్కసారిగా చంకనెత్తుకున్నారు.
IPL 2022, Danny Morrison lifts Sports presenter Karishma Kotak: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022కి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో నాలుగు రోజుల్లో (మార్చి 26) భారత్‌లో మెగా లీగ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2022లోకి మరో రెండు కొత్త జట్లు రావడంతో లీగ్ మరింత ఆసక్తిగా మారింది. ఐపీఎల్ టోర్నీలో ప్రతి సంవత్సరం ఎన్నో రికార్డులు, కొన్ని అద్భుతమైన సన్నివేశాలను మనం చూస్తాం. వీటితో పాటు కొన్నిసార్లు వివాదాస్పద సంఘటనలు కూడా జరుగుతుంటాయి. ఎలాంటి సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి క్రికెట్ అభిమానికి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ గురించి తెలుసు. తన అద్భుత బౌలింగ్‌తో మేటి బ్యాటర్‌లను సైతం ముప్పుతిప్పలు పెట్టారు. ఇక ఐపీఎల్ టోర్నీలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాఖ్యాతలలో కూడా డానీ ఒకరు. అలాంటి డానీ ఒకసారి తన వింత చర్యతో వివాదంలో చిక్కుకున్నారు. 2013లో జరిగిన ఐపీఎల్ 6వ సీజన్‌లో యాంకర్ కరిష్మా కోటక్‌ని షో జరుగుతుండగా మైదానంలోనే ఎత్తుకుని విమర్శల పాలయ్యారు.
ఐపీఎల్ 2013 సందర్భంగా టీవీ షో ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్ సమయంలో డానీ మోరిసన్, కరిష్మా కోటక్ గ్రౌండ్‌లో లైవ్ కామెంట్రీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య డ్యాన్స్ టాపిక్ రాగా.. కరిష్మాను డానీ ఒక్కసారిగా చంకనెత్తుకున్నారు. ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆపై నవ్వులు పూయించారు. ఈ ఘటన తర్వాత డానీ ట్రోల్ చేయబడ్డారు. 2013లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయింది. ఇక కరిష్మా కోటక్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2007లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో హీరోయిన్‌గా చేశారు.
డానీ మోరిసన్ వన్డే క్రికెట్‌ను భారత్‌పైనే అరంగేట్రం చేశారు. 1987 ప్రపంచకప్‌లో నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్ ద్వారా కివీస్ తరఫున అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్‌లో డానీ తన కోటా 10 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చారు. ఆ తర్వాత 1994లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ ( కపిల్ దేవ్, సలీల్ అంకోలా, నయన్ మోంగియా) తీశారు. దాంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. కివీస్ తరఫున డానీ 48 టెస్టులు, 96 వన్డేలు ఆడారు.
Also Read: Petrol Diesel Prices: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook