Delhi Capitals: ఐపీఎల్ 2022లో ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు శుభవార్త అందింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మరి కాస్సేపట్లో జరగనున్న మ్యాచ్‌కు కీలకమైన ఆటగాళ్లు అందుబాటులో రావడంతో ఢిల్లీ కేపిటల్స్ ఊపిరిపీల్చుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్ అందింది. వివిధ కారణాలతో దూరమైన కీలక ఆటగాళ్లు జట్టుకు అందుబాటులోకి వచ్చారు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నార్ట్జే ..లక్నోతో జరిగే మ్యాచ్‌లో ఆడనున్నాడు. గత ఐదు నెలల నుంచి గాయంతో బాధపడుతున్న అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఏడాది సీజన్‌ ఆరంభంలోనే జట్టుతో చేరినప్పటికీ..తొలి రెండు మ్యాచ్‌లను ఆడలేదు. 


మరోవైపు పాకిస్థాన్ పర్యటన కారణంగా మ్యాచ్‌లకు దూరమైన ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం తెలిపింది. డేవిడ్ వార్నర్ తన క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నాడని..తదుపరి మ్యాచ్‌లో ఆడతాడని..అతడి రాక తమకు కలిసి వస్తుందని ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ తెలిపాడు. డివై పాటిల్ స్టేడియం వేదికగా లక్నోతో ఢిల్లీ తలపడనుంది. రెండు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ..ఓ మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. అటు లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం మూడింట రెండు మ్యాచ్ లు నెగ్గి..4 పాయింట్లతో ఉంది. 


ఢిల్లీ కేపిటల్స్ జట్టు


పృథ్వీషా, డేవిడ్ వార్నర్, మన్‌దీప్‌ సింగ్,రిషబ్‌ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్‌పటేల్, కుల్దీప్‌ యాదవ్, అన్రిచ్‌ నార్ట్జ్‌, ముస్తఫీజుర్


లక్నో సూపర్ జెయింట్స్ జట్టు


కేఎల్ రాహుల్ (కెప్టెన్), డికాక్, మనీష్ పాండే, కైల్ మైయిర్స్, దీపక్ హుడా, ఆయుష్‌ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రై టై,చమరీ, రవి బిష్ణోయ్, అవేష్‌ ఖాన్.


Also read: MI: వరుస ఓటములతో ముంబై ఇండియన్స్, రోహిత్ శర్మ ఏమంటున్నాడు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook