Delhi Capitals Net Bowler test positive for Covid 19, DC players forced into isolation: కరోనా వైరస్ మహమ్మారి ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వదలడం లేదు. ఏప్రిల్ మాసం మధ్యలో పలువురు ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ వైరస్‌ బారిన పడగా.. తాజాగా మరొకరికి కరోనా సోకింది. ఆదివారం ఢిల్లీ నెట్‌ బౌలర్‌ కరోనా పాజిటివ్‌గా తేలాడు. రెగ్యులర్‌ కరోనా టెస్టుల్లో భాగంగా ఆటగాళ్లందరికి పరీక్షలు చేయగా.. నెట్‌ బౌలర్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీ ప్లేయర్స్ అందరూ హోటల్‌ రూమ్‌లో ఐసోలేషన్‌ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈరోజు రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ ఉన్న నేపథ్యంలో రెగ్యులర్‌ కరోనా టెస్టుల్లో భాగంగా ఉదయం ఆటగాళ్లందరికి ఢిల్లీ క్యాపిటల్స్ వైద్య బృందం పరీక్షలు చేసింది. అందులో నెట్‌ బౌలర్‌కు కరోనా  పాజిటివ్‌గా తేలింది. దీంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఢిల్లీ ఆటగాళ్లందరిని ఐసోలేషన్‌ పేరిట హోటల్‌ రూమ్‌కే పరిమితం చేశారు. ఢిల్లీ ప్లేయర్స్ అందరికీ మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు రావాల్సి ఉంది. రెండోసారి చేసిన ఫలితాలు వచ్చిన తర్వాతే నేడు రాత్రి చెన్నైతో మ్యాచ్‌ జరుగుతుందా లేదా అనేది తెలుస్తుంది.


'రెగ్యులర్‌ కరోనా టెస్టుల్లో భాగంగా ఈరోజు ఉదయం చేసిన పరీక్షలో ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ బౌలర్ పాజిటివ్‌గా తేలాడు. అతడిని ఐసోలేషన్‌లోకి పంపాము. ఆటగాళ్లను హోటల్‌ రూమ్‌లోనే ఉండమని ఆదేశించాం' అని ఐపీఎల్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచులో ఐదు విజయాలు అందుకున్న ఢిల్లీ.. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే చెన్నైతో మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. మరి మ్యాచ్ జరుగుతుందో లేదో చూడాలి. 


గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫారిన్ ప్లేయర్స్ మిచెల్‌ మార్ష్‌, టిమ్‌ సీఫెర్ట్‌ సహా ఫిజియో పాట్రిక్‌ ఫర్హాత్, మరో నలుగురు కరోనా బారిన పడ్డారు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు అందరూ వైరస్ బారిన పడ్డారు. దీంతో చివరి నిమిషంలో పుణేలో జరగాల్సిన మ్యాచ్‌ను వాంఖడేకు మార్చారు. ఈ సీజన్లో ఢిల్లీ తప్ప మరే జట్టు ప్లేయర్స్ వైరస్ బారిన పడలేదు. ఇక ఐపీఎల్ 2022 చివరి అంకానికి చేరుకున్న విషయం తెలిసిందే. 


Also Read: SVP Pre Release Event: ఆ విషయంలో మహేష్‌ బాబుతో పోటీ పడలేకపోయా: కీర్తి సురేష్‌


Also Read: Yuvraj Singh Captaincy: అందుకే నేను టీమిండియా కెప్టెన్‌ కాలేకపోయా.. అసలు విషయం చెప్పిన యువరాజ్‌!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook