Gujarat Titans vs Rajasthan Royals Playing XI and Dream11 Team: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 తుది సమరానికి రంగం సిద్దమైంది.  ఐపీఎల్ 2022 ఫైనల్‌ పోరులో గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7.30 గంటలకు టాస్ పడనుండగా.. 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈసారే మెగా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చి మేటి జట్లను సైతం మట్టికరిపించి ఫైనల్ చేరుకున్న గుజరాత్.. తొలి ప్రయత్నంలోనే టైటిల్ గెలవాలని చూస్తోంది. మరోవైపు 14 ఏళ్ల తర్వాత ఫైనల్ ఆడుతున్న రాజస్థాన్.. రెండో టైటిల్ పట్టాలని బరిలోకి దిగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు బలంగా ఉంది. ఓపెనర్ జోస్ బట్లర్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే నాలుగు సెంచరీలు బాదిన అతడిని అడ్డుకోవడం కష్టమే. ఫైనల్‌లోనూ భారీ స్కోర్ చేస్తాడని పింక్ టీమ్ నమ్మకంగా ఉంది. యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్, షిమ్రోన్ హెట్మెయిర్ కూడా బ్యాట్ జులిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.  రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చహల్ వంటి టాప్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. అందరూ చెలరేగితే ట్రోఫీ ఖాతాలో పడడం పెద్ద కష్టమేమి కాదు. 


గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా చాలా పటిష్టంగా ఉంది. శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా మంచి ఆరంభాలు ఇస్తున్నారు. హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియాలు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. నిరాశపరుస్తున్న మాథ్యూ వేడ్ తుది జట్టులో ఉంటాడో లేదో చూడాలి. భారీగా పరుగులు ఇస్తున్న అల్జారీ జోసెఫ్ స్థానంలో లోకీ ఫెర్గూసన్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రషీద్ ఖాన్, ఆర్ సాయి కిశోర్, యష్ దయాళ్, మహ్మద్ షమీలు మంచి ఊపుమీదున్నారు. గుజరాత్ ఫామ్ చూస్తే.. టైటిల్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. 


తుది జట్లు (అంచనా):
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్‌కే, యజువేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ.
గుజరాత్ టైటాన్స్‌: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూవేడ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిశోర్, యష్ దయాళ్, లోకీ ఫెర్గూసన్/అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ.


డ్రీమ్ 11 టీమ్:
జోస్ బట్లర్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, సంజు శాంసన్, డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, ఒబెద్ మెక్‌కే. 


Also Read: IPL 2022 Final: ఐపీఎల్ 2022 విజేత ఎవరో చెప్పేసిన హర్భజన్.. రైనా, అక్తర్ ఓటు ఎవరికో తెలుసా?


Also Read: Tirumala Rush: తిరుమలలో రికార్డు స్థాయిలో పోటెత్తిన భక్తులు, బ్రేక్ దర్శనాలు రద్దు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook