Samson Samson hails Rajasthan Royals players for playing good cricket in IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్లో తమ ఆటగాళ్లు అందరూ బాగా ఆడారని, ఫైనల్లో ఓడినా జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచేందుకే ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాం అని తెలిపాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన ఐపీఎల్ 2022 ఫైనల్లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అరంగేట్రం సీజన్‌లోనే టైటిల్‌ను కొల్లగొట్టి గుజరాత్ చరిత్ర సృష్టిస్తే.. 14 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరుకుని రెండో టైటిల్ అందుకోవాలనుకున్న రాజస్థాన్ కల నెరవేరలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ... 'ఈ సీజన్ మాకు చాలా ప్రత్యేకం. గత 2-3 సీజన్‌లలో అభిమానులు, ప్లేయర్స్ గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నారు. ఈసారి అద్భుత క్రికెట్‌తో అభిమానులను అలరించాం. జట్టు ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా. యువ ఆటగాళ్లు, సీనియర్ ప్లేయర్లు అద్భుతంగా ఆడారు. టైటిల్ గెలవాలంటే ఫాస్ట్ బౌలర్లు జట్టులో ఉండాలని ముఖ్యమని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. అందుకే స్టార్ బౌలర్లను తీసుకున్నాం' అని చెప్పాడు. 


'ఇన్నింగ్స్ చివరి వరకు జోస్ బట్లర్ ఆడాలని మేము ముందే అనుకున్నాం. నేను మాత్రం వేగంగా ఆడాలనుకున్నా. నేను చేసిన 30, 40 పరుగులు జట్టు విజయానికి అవసరం అయ్యాయి. ఈ ఓటమితో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్‌కు అభినందనలు. విజయానికి వారు అన్ని విధాలా అర్హులు' అని సంజూ శాంసన్ పేర్కొన్నాడు. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాం అని సంజూ తెలిపాడు. 


ఫైనల్లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (39; 35 బంతుల్లో 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. హార్దిక్‌ పాండ్యా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం గుజరాత్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. శుబ్‌మన్‌ గిల్‌ (45 నాటౌట్‌; 43 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (34; 30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.


Also Read: Hardik Pandya Celebrations: వైరల్ వీడియో.. భావోద్వేగాన్ని ఆపుకోలేక భార్యను గట్టిగా.!


Also Read: Whiskey Bottle Auction: ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బాటిల్.. వేలంలో రూ.10 కోట్లకు విక్రయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook