10 Teams divided in to Two groups in IPL 2022: ఐపీఎల్ 2022 మార్చి 26 నుంచి ప్రారంభం అవుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ విజ్ఞప్తి మేరకు టోర్నీని ముందుగానే ఆరంభించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (జీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది రెండు కొత్త టీమ్స్ వచ్చిన నేపథ్యంలో మొత్తం 10 జట్లు 74 మ్యాచ్‌లు ఆడే విధంగా షెడ్యూల్‌ రూపొందించింది. భారత్‌లో జరిగే మెగా టోర్నీకి పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో 10 జట్లు ఉండడంతో ఈసారి ఫార్మాట్ మారింది. గతంలోలా కాకుండా.. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.  టైటిల్స్, ఫైనల్ మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా జట్లకు ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. అత్యధిక టైటిల్స్ గెలిచిన ముంబై (5) అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై (4) రెండు, కోల్‌కతా (2) మూడు, హైదరాబాద్ (1)నాలుగు, రాజస్థాన్ (1) ఐదో స్థానంలో ఉన్నాయి. టైటిల్ గెలవని జట్లలో ఎక్కువ సార్లు ఫైనల్, ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు ఆరు.. ఢిల్లీ ఏడు.. పంజాబ్ 8వ స్థానంలో ఉన్నాయి. కొత్త జట్లలో లక్నో 9, గుజరాత్ 10 స్థానాల్లో ఉన్నాయి. 


జట్లకు ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారమే 10 టీంలను రెండు గ్రూపులుగా విభజించారు. 5 టైటిల్స్ గెలిచిన ముంబై గ్రూప్-ఏలో ఉండగా అగ్రస్థానంలో ఉండగా.. 4 టైటిల్స్ గెలిచిన చెన్నై గ్రూప్-బిలో టాప్ ప్లస్ దక్కించుకుంది. అంటే బేసి సంఖ్య ర్యాంక్ కలిగిన జట్లు ( ముంబై, కోల్‌కతా , రాజస్థాన్, ఢిల్లీ, లక్నో) గ్రూప్‌-ఏలో ఉండనుండగా.. సరిసంఖ్య ర్యాంక్ కలిగిన జట్లు (చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్) గ్రూప్-బిలో ఉన్నాయి. 


కొత్త ఫార్మాట్ ప్రకారం.. ఒక గ్రూప్‌లో ఉన్న టీమ్స్ అదే గ్రూప్‌లోని మిగతా నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. వేరే గ్రూప్‌లోని తమ పొజిషన్‌లోనే ఉన్న జట్టుతో రెండు మ్యాచులు.. మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఉదాహరణకు గ్రూప్-బిలో ఉన్న హైదరాబాద్.. తన గ్రూప్‌లోని చెన్నై, బెంగళూరు, పంజాబ్, గుజరాత్‌లతో రెండేసి మ్యాచులు ఆడుతుంది. ఇక గ్రూప్-ఏలో తమ పొజిషన్‌లోనే ఉన్న కోల్‌కతాతో రెండు మ్యాచులు ఆడి.. ముంబై, రాజస్థాన్, ఢిల్లీ, లక్నోలతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఇదే విధంగా అన్ని జట్లు లీగ్ దశలో పోటీపడతాయి. మొత్తంగా ఒక్కో జట్టు 14 లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. లీగ్ దశలో ఒక్కో జట్టు ఏడేసి మ్యాచ్‌లు ఇంట బయటా ఆడనున్నాయి. మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు లీగ్ దశలో జరగనున్నాయి. త్వరలోనే షెడ్యూల్ రానుంది. 


Also Read: Petrol Prices Hikes: సామాన్యులపై పెట్రో మంట.. లీటర్‌ పెట్రోల్‌ ధర ఏకంగా రూ.150!!


Also Read: Chandrababu Naidu on Bheemla Nayak: భీమ్లా నాయక్‌ సినిమాపై జగన్‌ తీరు ఉగ్రవాదాన్ని తలపిస్తోంది: చంద్రబాబు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook