Gautam Gambhir: టీమ్ ఇండియా మాజీ ఆటగాడు.. గౌతమ్​ గంభీర్​ ఐపీఎల్​లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్​ 2022లో గౌతమ్​ గంభీర్ ఓ టీమ్​కు (Gautam Gambhir back to IPL) మెంటార్​గా వ్యవహరించనున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్​లో కొత్తగా ఏర్పాటైన లఖ్​నవూ ఫ్రాంఛైజీ.. గౌతమ్​​ గంభీర్​ను మెంటార్​గా (Gautam Gambhir appointed Lucknow mentor ) నియమించుకుంది. జింబాబ్వే మాజీ కెప్టెన్​ అండీ ఫ్లవర్​ టీమ్​ హెడ్ కోచ్‌గా ఎంపిక చేసిన మరునాడే.. గంభీర్​ను మెంటార్​గా నియమించుకుంటున్నట్లు ప్రకటన వెలువడటం గమనార్హం. ఆండీ చివరి రెండు సీజన్లలో పంజాబ్​ కింగ్స్​కు అసిస్టెంట్ కోచ్​గా పని చేసి.. ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశాడు.


ఐపీఎల్​లో గంభీర్​కు ప్రత్యేక గుర్తింపు..


ఐపీఎల్​లో గౌతమ్​ గంభీర్​కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కోల్​కతా నైట్​ రైడర్స్ (కేకేఆర్​) సారథిగా  2012, 2014లో రెండు సార్లు టైటిల్​ గెలిపించిన ఘనత గంభీర్​ సొంతం.


2017 వరకు కోల్​కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన గంభీర్​.. 2018లో ఢిల్లీ డేర్​ డెవిల్స్​ సారథిగా బాధ్యతలు స్వీకరించాడు. అయితే కెప్టెన్సీ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. ఇక అదే సంవత్సరం అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు.


రిటైర్మెంట్ తర్వాత బీజేపీలో చేరిన గౌతమ్​ గంభీర్​.. ఈస్ట్​ ఢిల్లీ నుంచి ఎంపీగా గెలుపొందటం గమనార్హం.


Also read: Glenn Maxwell: భారత అల్లుడు కాబోతున్న మాక్స్‌వెల్-పెళ్లిపై గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్


Also read: Rohit Sharma : సౌత్ ఆఫ్రికా వెళ్లని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియాలో ఏం చేస్తున్నాడో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook