Jos Buttler became 6th batter to score more than 700 runs in a single season: ఐపీఎల్ 2022 తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో రాజస్థాన్‌ రాయల్స్‌ చిత్తైన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (89; 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సంజూ శాంసన్‌ (47; 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో అర్ధ సెంచరీ కోల్పోయాడు. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్‌ 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. డేవిడ్‌ మిల్లర్‌ (68 నాటౌట్‌; 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచులో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్ జోస్ బట్లర్‌ రెండు రికార్డులను ఖాతాలో వేసుకొన్నాడు. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు 718 పరుగులు చేసి అత్యధిక రన్స్ జాబితాలో అగ్రస్థానంకి చేరుకున్నాడు. దాంతో ఒకే సీజన్‌లో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (973), డేవిడ్ వార్నర్ (848), కేన్ విలియమ్సన్ (735), మైకేల్‌ హస్సీ (733), క్రిస్‌ గేల్ (733) బట్లర్ కంటే ముందు ఉన్నారు. 


ఈ మ్యాచులో జోస్ బట్లర్‌ మరో రికార్డు కూడా అందుకున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌పై 89 పరుగులు చేయడంతో టీ20ల్లో 8000 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లో 8051 పరుగులు చేశాడు. దాంతో టీ20ల్లో 8000 రన్స్ పూర్తిచేసిన మూడో ఇంగ్లండ్ బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. బట్లర్‌కు కంటే ముందు అలెక్స్ హేల్స్, లూక్‌ రైట్ ఉన్నారు. హేల్స్, రైట్ ఎక్కువగా టీ20లు ఆడడం లేదన్న విషయం తెలిసిందే. 


మరోవైపు ఐపీఎల్ 2022లో జోస్ బట్లర్‌ తర్వాత కేఎల్ రాహుల్ (537), క్వింటన్ డికాక్ (502) మాత్రమే అత్యధిక రన్స్ చేశారు. లక్నో ఫైనల్‌ వరకు చేరుకుంటే.. రాహుల్, డికాక్ మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. భారీ ఇన్నింగ్స్‌లను ఆడితే బట్లర్‌ను అందుకునే అవకాశం ఉంది. అయితే రాజస్థాన్‌ కూడా రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశాలు ఉన్నాయి. క్వాలిఫయర్‌-2లో గెలిస్తే ఫైనల్‌ ఆడుతుంది. కాబట్టి ప్రస్తుత సీజన్‌లో బట్లరే ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కానున్నాడు. 


Also Read: LSG vs RCB Eliminator: ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం వారిదే.. కారణం ఏంటో తెలుసా?


Also Read: CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్..రేపు బెంగళూరుకు పయనం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి