Harsha Bhogle suddenly disappears from Cricket Sportwalk live chat: ప్రముఖ భారత క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేకు సంబందించిన ఓ వార్త గత 24 గంటలుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ ఛానెల్‌లో ఐపీఎల్ 2022కు సంబంధించిన లైవ్‌ ప్రోగ్రామ్‌ చేస్తుండగా.. హర్షాపై దాడి జరిగిందని ఆ వార్త సారాంశం. లైవ్ జరుగుతుండగా హర్షా అకస్మాత్తుగా స్క్రీన్‌పై కనిపించకుండా పోవడం.. అతనిపై ఎవరో దాడి చేసినట్టు అరుపులు, కేకలు వినిపించడంతో లైవ్ చూస్తున్న అందరూ షాక్‌కు గురయ్యారు. హోస్ట్ కూడా హర్షా.. ఏమైంది అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లైవ్‌ ప్రోగ్రామ్‌లో హర్షా భోగ్లే కనిపించకుండా పోవడంతో.. అతడికి ఏమైంది అంటూ క్రికెట్ అభిమానులు ఆరాతీయడం మొదలెట్టారు. హర్షాపై ఎవరు దాడి చేశారు?, ఎందుకు చేశారు? అని వరుస ట్వీట్స్ చేశారు. మరోవైపు స్పోర్ట్ వాక్ ఇన్ ఛానెల్ కూడా 'హర్షా భోగ్లేకి ఏమైందో మాకు అర్ధం కావడం లేదు. సమాచారం తెలుసుకునేందుకు హర్షా, అతడి టీమ్‌తో సంప్రదింపులు చేస్తున్నాం. త్వరలో మీకు సమాచారం ఇస్తాం' అని ట్వీట్ చేసింది. దాంతో అభిమానులు మరింత ఆదోళనకు గురయ్యారు. చివరకు ఇదంతా ఓ ప్రాంక్ అని తేలింది. సదరు చానెల్‌కు హైప్ తెచ్చేందుకు ఇలా చేశారట. 


తాజాగా కామెంటేటర్ హర్షా భోగ్లే ఈ ఘటనపై స్పందించాడు. 'నేను క్షేమంగానే ఉన్నాను. ఎవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిజం చెపుతున్నా.. నాపై ఎవరు దాడి చేయలేదు. ఆ లైవ్ వీడియోలో మేమ అనుకున్నది ఒకటైతే.. మరొకటి జరిగింది. ఉద్దేశపూర్వకంగా ఎవ్వరిని ఇబ్బంది పెట్టాలని మాత్రం  చేయలేదు. ప్రతిఒక్కరిని నేను క్షమాపణలు కోరుతున్నా. మీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. సారీ అండ్ ఛీర్స్' అంటూ హర్షా ట్వీట్ చేశారు. హర్షా వివారణపై కొందరు మండిపడుతుంటే.. మరికొందరు మద్దుతుగా నిలుస్తున్నారు. 



ఇక హర్షా భోగ్లే హైదరాబాద్‌కు చెందిన వక్తే. మరాఠీ కుటుంబంలో హర్షా.. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌‌లో ప్రాథమిక విద్యను అభ్యసించిన అతను.. ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. అందుకే హర్షా తెలుగులో కూడా అనర్గళంగా మాట్లాడగలరు. హర్షా క్రికెటర్ కాకపోయినా.. ఆటపై చాలా గ్రిప్ ఉండడంతో వ్యాఖ్యాతగా రాయించారు. అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచులలో తనదైన ముద్రవేశారు. ఐపీఎల్ 2022లో కూడా అతను అలరించనున్నారు. 


Also Read: IPL 2022 Captains List: కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై.. ఈసారి నలుగురు కొత్తవారికి సారథ్యం! 10 జట్ల కెప్టెన్‌ల జాబితా ఇదే!!


Also Read: RRR Movie: బాహుబలి పాయే.. ఇకపై 'నాన్ ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డ్స్': శోభు యార్లగడ్డ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook