IPL 2022, KL Rahul: లఖ్‌నవూ కెప్టెన్ గా కేఎల్ రాహుల్!
IPL 2022: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లఖ్‌నవూకు కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు. గత రెండు సీజన్‌లలో పంజాబ్ కింగ్స్‌కు రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
IPL 2022: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లఖ్‌నవూకు (Lucknow Team) కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహారించనున్నాడు. వచ్చేనెలలో బెంగళూరులో ఆటగాళ్ల మెగా వేలానికి ముందు లఖ్‌నవూ ఎంపిక చేసుకున్న ముగ్గురిలో రాహుల్ (KL Rahul ) ఒకడని తెలుస్తోంది. మిగతా ఇద్దరిలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయ్‌నిస్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఉండే అవకాశం ఉంది.
రాహుల్‌కు రూ.15 కోట్లు, స్టాయ్‌నిస్‌కు (Marcus Stoinis) రూ.11 కోట్లు, బిష్ణోయ్‌కు (spinner Ravi Bishnoi) రూ.4 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘లఖ్‌నవూకు రాహుల్ సారథ్యం వహిస్తాడు. మిగతా ఇద్దరు ఆటగాళ్ల ఎంపికపై జట్టు నిర్ణయం తీసుకోనుందని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. గత రెండు సీజన్‌లలో పంజాబ్ కింగ్స్‌కు రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. పంజాబ్‌కు బిష్ణోయ్, దిల్లీ క్యాపిల్స్‌కు స్టాయ్‌నిస్ ప్రాతినిధ్యం వహించారు.
Also Read: IPL 2022: అహ్మదాబాద్ కెప్టెన్‌గా హార్డిక్ పాండ్యా!
లక్నో ఫ్రాంచైజీని (Lucknow franchise) కొనుగోలు చేసేందుకు ఆర్పీఎస్జీ (RPSG) గ్రూప్ రూ.7,090 కోట్లు వెచ్చించింది. టీమ్‌ఇండియా పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్ కావడం గురించి తాను ఆలోచించట్లేదని వన్డే జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. అవకాశం వస్తే మాత్రం సాధ్యమైనంత మెరుగ్గా జట్టును నడిపిస్తానని చెప్పాడు. రోహిత్ శర్మకు గాయం కావడంతో.. రాహుల్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో (South Africa) భారత వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు. ప్రోటీస్ తో భారత్ తన తొలి వన్డే మ్యాచ్ నేటి (జనవరి 19) నుంచి ఆడనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook