IPL 2022, KKR vs PBKS Playing 11: ఐపీఎల్ 2022లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఆడిన తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ధేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయాన్ని పంజాబ్ అందుకోగా.. తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌ లాంటి పటిష్ట జట్టును కోల్‌కతా రఫ్పాడించింది. అయితే బెంగళూరుతో జరిగిన మ్యాచులో మాత్రం తేలిపోయింది. దాంతో ఈ మ్యాచులో గెలిచి రెండో విజయం అందుకోవాలని చూస్తోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 గంటలకు కోల్‌కతా, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. మ్యాచ్ నేపథ్యంలో ఇరుజట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓపెనర్లు అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్‌ త్వరగానే పెవిలియన్ చేరాడు. కోల్‌కతా భారీ స్కోరు సాధించాలంటే ఇద్దరు మళ్లీ ఫామ్‌ అందుకోవాల్సి ఉంది. నితీష్ రాణా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గత మ్యాచ్‌లో విఫలమయ్యారు. ఈ ఇద్దరు నిలకడగా పరుగులు చేయాల్సిన అవసరముంది. సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్, ఆండ్రీ రస్సెల్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. పేసర్ ఉమేష్ యాదవ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాణించాడు. అతడికి తోడు టిమ్‌ సౌథీ కూడా రాణిస్తే తిరుగుండదు. స్పిన్‌ విభాగంలో సునీల్‌ నరైన్ రాణిస్తున్నా.. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి తేలిపోయాడు. అతడు ఫామ్ అందుకుంటే ప్రత్యర్థి తక్కువ స్కోరుకే పరిమితం అవుతుంది. 


బెంగళూరుతో జరిగిన మ్యాచులో పంజాబ్‌ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ అదరగొట్టారు. మరోసారి వీరు చెలరేగాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్‌పైనే పంజాబ్‌ ఆశలు పెట్టుకుంది. ఓడియన్ స్మిత్, షారుఖ్ ఖాన్ కూడా సత్తా చాటితే తిరుగుండదు. అండర్‌-19 వరల్డ్‌ కప్‌ స్టార్‌ రాజ్‌బావాకు మరో అవకాశం దక్కుతుందో లేదో. మూడు రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ జట్టులో చేరనున్నాడు. దాంతో అర్ష్‌దీప్ సింగ్‌పై వేటు పడనుంది.  సందీప్ శర్మ, ఒడియన్ స్మిత్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్‌లు రాణిస్తే పంజాబ్ విజయం సాధించడం సులువే. 


తుది జట్లు (అంచనా):
కోల్‌కతా: వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. 
పంజాబ్: శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), భానుక రాజపక్స (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, రాజ్ బావా, మహ్మద్ షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, హర్‌ప్రీత్ బ్రార్, సందీప్ శర్మ, కగిసొ రబడ, రాహుల్ చహర్. 


Also Read: Dwayne Bravo: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన డ్వేన్‌ బ్రావో.. ఎవరికీ సాధ్యం కాదేమో ఇగ?


Also Read: Telangana Weather: తెలంగాణలో ఆ 6 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook