RR vs KKR: ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ ఆసక్తిగా సాగింది. 9 బంతుల్లో 10 పరుగులు..7 బంతుల్లో 7 పరుగులు..ఆ తరువాత ఏమైంది. మ్యాచ్ ఎవరు గెలిచారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్ 54 పరుగులతో రాణించగా..హిట్ మేయర్ 25 పరుగులు, జోస్ బట్లర్ 22 పరుగులు చేశారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ సౌథీ 2 వికెట్ల పడగొట్టగా..శివమ్, రాయ్, ఉమేశ్‌లు తలో వికెట్ తీశారు. పడిక్కల్ ముందే అవుటవడం, ప్రతి మ్యాచ్‌లో అద్భుతంగా రాణిస్తున్న జోస్ బట్లర్ ఈసారి 22 పరుగులే చేయడంతో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. చివర్లో హిట్ మెయిర్ ధాటిగా ఆడటంతో 152 పరుగులు చేయగలిగింది.


అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కూడా రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్‌కు తడబడిందనే చెప్పాలి. నాలుగో ఓవర్లో తొలి వికెట్ ఆరోన్ ఫించ్, ఆరవ ఓవర్లో రెండవ వికెట్ ఇంద్రజిత్ అవుటయ్యారు. ఆ తరువాత నెమ్మదిగా కోలుకుని ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. చివరి వరకూ అంటే 7 బంతులు మిగిలున్నంతవరకూ మ్యాచ్ ఉత్కంఠగానే సాగింది. 12 బంతుల్లో 18 పరుగులు..9 బంతుల్లో పది పరుగులు, 8 బంతుల్లో 9 పరుగులు, 7 బంతుల్లో 7 పరుగుల వరకూ మ్యాచ్ కొనసాగింది. చివర్లో రెండు వైడ్స్ రావడంతో పాటు ఓ బౌండరీ రావడంతో 1 బంతికి 6 పరుగులు అవసరమయ్యాయి. అంతే చివరి ఓవర్ తొలిబంతిని సిక్సర్‌గా మల్చడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్..రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసుకుంది. కేకేఆర్ తరపున నితీష్ , రింకూలు అద్భుతంగా రాణించారు. నితీష్ 44 పరుగులు చేయగా, రింకూ 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి..కేకేఆర్ విజయం సాధించింది.


Also read: Dhoni Fan Banner Viral: మహీ కోసం చచ్చేందుకు సిద్ధం, వైరల్ అవుతున్న అభిమాని బ్యానర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.