IPL 2022 Likely to Start on April 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 2022 త్వరలోనే ప్రారంభం కానుంది. ఐపీఎల్ 15వ సీజన్‌ను ఆరంబించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సిద్ధమవుతోంది. ఐపీఎల్ 2022 ఎడిషన్‌ ఏప్రిల్​ 2 నుంచి ఆరంభం అవుతుందని సమాచారం తెలుస్తోంది. ఈ మేరకు అన్ని ఫ్రాంఛైజీలకు బీసీసీఐ సమాచారం అందించినట్లు సమాచారం. చెన్నై వేదికగానే తొలి మ్యాచ్​ నిర్వహించనున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. మ్యాచుల తేదీలు ఖరారు కాకున్నా.. ఏప్రిల్​ 2 నుంచి లీగ్ ఆరంబించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుందట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకు మెగా లీగ్‌లో 8 జట్లు పాల్గొనగా.. ఐపీఎల్ 2022 సీజన్​లో 10 జట్లు పోటీపడన్నాయి. ఇటీవలే బీసీసీఐ రెండు కొత్త జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు కొత్త జట్లు రానున్న నేపథ్యంలో మొత్తంగా 74 మ్యాచ్​లు నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. 60 రోజులకు పైగా మ్యాచ్​లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఫైనల్​ మ్యాచ్ జూన్​ తొలి వారంలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోందట.


జూన్ 4 లేదా 5న ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచులు ఆడనున్న విషయం తెలిసిందే. ఇందులో ఏడు సొంత గడ్డపై, మరో ఏడు మిగతా జట్ల సొంత మైదానంలో ఆడనున్నాయి. 


Also Read: FIR Against Kangana Ranaut: మరో వివాదంలో కంగనా రనౌత్.. ముంబయిలో ఆమెపై కేసు నమోదు


ఐపీఎల్ 2021 విజేత చెన్నై సూపర్ కింగ్స్ కాబట్టి.. 15వ సీజన్​లో సీఎస్‌కే చెన్నై చెపాక్ మైదానంలో తొలి మ్యాచ్ ఆడనుంది. సీఎస్‌కేతో ఆడే జట్టు ఎదో ఇంకా తేలలేదు. అయితే ముంబై ఇండియన్స్‌ జట్టే చెన్నైతో తలపడనుందని సమాచారం. కోల్​కతా నైట్ రైడర్స్ జట్టుతో చెన్నై తలపడే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా చెపాక్ మైదానంలో చెన్నై ఐపీఎల్ 2022లో తొలి మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్ 2020 యూఏఈలో జరగ్గా.. 2021 భారత్, యూఏఈలో జరిగిన విషయం తెలిసిందే. భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వచ్చే సీజన్ మన దగ్గరే జరగనుంది. 


ఐపీఎల్ 2022 పూర్తిగా భారత్‌లోనే జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి జే షా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 'అన్నీ అనుకూలంగా ఉంటే ఐపీఎల్ 2022​ను భారత్‌లోనే నిర్వహిస్తాం. మరో రెండు కొత్త జట్లు వస్తున్న నేపథ్యంలో లీగ్‌లో మరింత జోష్ వస్తుందని భావిస్తున్నా. చెన్నై చెపాక్‌ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడటం మీరు చూసే అవకాశం ఉంది. అతి త్వరలోనే మెగా వేలం నిర్వహించబోతున్నాం. కొత్త కాంబినేషన్స్‌పై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. ఏ జట్టులో ఏ ఆటగాళ్లు ఉంటారో చూడాలి' అని జే షా చెప్పారు. 


Also Read: త్వరలో తగ్గనున్న ఇంధన ధరలు, చమురు నిల్వలు తీసేందుకు కేంద్రం నిర్ణయం


ఐపీఎల్ 2022లో 10 జట్లు తలపడుతున్నాయి. రెండు కొత్త ప్రాంఛైజీల కోసం ఆర్పీఎస్‌జీ రూ.7090 కోట్లు, సీవీసీ క్యాపిటల్స్‌ రూ.5625 కోట్లు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. దాంతో రూ.12,715 కోట్లు ఐపీఎల్‌ ఖజానాలో చేరనున్నాయి. 15వ సీజన్‌ నుంచి మ్యాచ్‌ల సంఖ్య 60 నుంచి 74కు పెరుగుతుంది. గతంలో మ్యాచ్‌కు రూ.54.5 కోట్లు చెల్లించేలా స్టార్‌ ఇండియా ఒప్పందం చేసుకుంది. వచ్చే సీజన్లలో మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రసార హక్కుల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ వేదికలకు ఆదరణ పెరిగింది. దీంతో ఐపీఎల్‌ ప్రసార హక్కులు దక్కించుకునేందుకు అవి కూడా పోటీపడే ఆస్కారముంది. ఐపీఎల్ 15 కోసం మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook