IPL Mega Auction 2022: న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌కి ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికింది. బౌల్ట్‌ కనీస ధర రూ.2 కోట్లు కాగా.. రాజస్తాన్ రాయల్స్ జట్టు అతన్ని రూ.8 కోట్లకు దక్కించుకుంది. బౌల్ట్‌ను రిటైన్ చేసుకునేందుకు ముంబై ప్రయత్నించినప్పటికీ రాజస్తాన్‌తో పోటీ పడలేకపోయింది. గత ఐపీఎల్ సీజన్‌లో ముంబై తరుపున ఆడిన బౌల్ట్.. త్వరలో ప్రారంభమయ్యే సీజన్‌లో రాజస్తాన్ తరుపున ఆడనున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బౌల్ట్‌ 2015లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలుత సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరుపున ఆడాడు. ఆ సీజన్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు సాధించాడు. ఆ తర్వాతి సీజన్‌లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడి ఒక వికెట్ సాధించాడు. 2017 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున ఆడిన బౌల్ట్.. ఆరు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు.


ఐపీఎల్ 2018, 2019 సీజన్‌లలో బౌల్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడాడు. ఆ తర్వాత 2020, 2021లో ముంబై ఇండియన్స్ జట్టు తరుపున ఆడాడు. 2020లో ముంబై తరుపున 15 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు సాధించాడు. ఆ సీజన్‌లో ముంబై ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2021లోనూ ముంబై తరుపున బౌల్ట్ అద్భుతంగా రాణించాడు. 14 మ్యాచ్‌లలో 13 వికెట్లు తీశాడు. మొత్తంగా ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 62 మ్యాచ్‌లు ఆడిన బౌల్ట్.. 26.09 యావరేజ్‌తో 76 వికెట్లు సాధించాడు. 


ముంబై ఈసారి కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పేసర్ జస్ప్రిత్ బుమ్రా, డాషింగ్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్, ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌లను రిటైన్ చేసుకోవడంతో బౌల్ట్‌ను వదులుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ వేలంలో బౌల్ట్‌ను దక్కించుకునే ప్రయత్నం చేయగా రాజస్తాన్‌తో పోటీ పడలేకపోయింది. దీంతో ఈసారి ఈ కివీ ప్లేయర్ పింక్ స్క్వాడ్ తరుపున ఐపీఎల్‌లో ఆడనున్నాడు. 



Also Read: KKR Shreyas Iyer: భారీ ధరకు శ్రేయాస్ అయ్యర్‌ను కైవసం చేసుకున్న కేకేఆర్ .. కెప్టెన్‌గా ఎంపిక లాంఛనమే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo