IPL 2022 Match 6: ఐపీఎల్‌ లో మరో రెండు కీలక జట్ల మధ్య బుధవారం ఫన్‌ ఫైట్‌ జరగనుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ తలపడనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌ లో గెలిచిన ఉత్సాహంతో కోల్‌ కతా రెండో మ్యాచ్‌ కు సిద్ధంకాగా.. రెండో మ్యాచ్‌ లోనైనా గెలిచి ఈ సీజన్‌లో  ఖాతా తెరవాలని ఆర్సీబీ చూస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్‌ 15వ సీజన్‌లో బుధవారం ఆర్సీబీ, కోల్‌ కతా తొలిసారి తలపడనున్నాయి.  ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో రాత్రి ఏడున్నరకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.  ఇప్పటికే తొలి మ్యాచ్‌ లో చెన్నైపై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన కోల్‌ కతా నెక్ట్స్‌ మ్యాచ్‌ లోనూ గెలవాలని పట్టుదలతో ఉంది. అటు ఇప్పటికే పంజాబ్‌ చేతిలో పరాజయం పొందిన ఆర్సీబీ ఈ మ్యాచ్‌ లోనైనా గెలిచి ఈ సీజన్‌లో బోణి కొట్టాలని చూస్తుంది. ఫలితంగా ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ మాత్రం రసవత్తరంగా జరగనుంది.


ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లోనూ కోల్‌ కతా ఫైనల్‌ ఎలెవన్‌ లో పెద్దగా మార్పులు చేసే అవకాశం తక్కువ అని చెప్పుకోవచ్చు. అజింఖ్య రహానే, వెంకటేశ్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా, శ్రేయస్‌ అయ్యర్‌, సామ్‌ బిల్లింగ్స్‌తో కేకేఆర్‌ బ్యాటింగ్‌ లైనప్‌ చాలా స్ట్రాంగ్‌ గా ఉంది. ఇక బౌలింగ్‌ విభాగంలో కోల్‌ కతా పటిష్ఠంగా కనిపిస్తోంది. ఉమేష్‌ యాదవ్‌ తొలి మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. సునీల్‌ నరైన్‌, రస్సెల్‌, వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌ మావిలతో కూడా బౌలింగ్‌ లైనప్‌ బలంగా కనిపిస్తోందనే చెప్పుకోవాలి. 


ఇక పంజాబ్‌ ‌ తో జరిగిన మ్యాచ్‌ లో ఆర్సీబీ  ఓటమిపాలైంది. 5 వికెట్ల తేడాతో పంజాబ్‌ గెలుపొందింది. ఆర్సీబీ నూతన కెప్టెన్‌ డుప్లెసిస్‌ తొలి మ్యాచ్‌ లో తనదైన ఆటతీరుతో మెప్పించాడు. కోహ్లీ, దినేశ్‌ కార్తీక్‌, రుథర్‌ఫోర్డ్‌ లతో బెంగళూరు బ్యాటింగ్‌ కాస్త మెరుగ్గానే ఉంది. అటు డేవిడ్‌ విల్లీ, సిరాజ్‌, అహ్మద్‌, వాయిందు హసరంగలతో కూడిన బౌలింగ్‌ విభాగం మాత్రం పటిష్ఠంగా ఉంది. మొత్తంగా కేకేఆర్‌, ఆర్సీబీ మధ్య ఇప్పటివరకు 30 మ్యాచ్‌ లు జరిగితే 17 సార్లు కేకేఆర్‌, 13 సార్లు ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్‌ తీసుకునే అవకాశం ఉంది.


Also Read: Huzurnagar Election: హైకోర్టులో మరో స్టే తెచ్చుకున్న ఏపీ సీఎం జగన్.. ఏప్రిల్ 26 వరకు అనుమతి!


Also Read: Bus Accident: భాకరాపేట ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు పరిహారం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook