MI vs PBKS: Rohit Sharma needs more 25 runs to complete 10000 runs In T20 Cricket: ఐపీఎల్ 2022లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబై ఇండియ‌న్స్‌, పంజాబ్ కింగ్స్ జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. పుణే వేదిక‌గా రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7:30 గంట‌ల‌కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు విజ‌యాలు సాధించిన పంజాబ్ ఈ మ్యాచ్ గెలిచి మ‌రో విజయాన్ని ఖాతాలో వేసుకోవాల‌ని చూస్తుండగా.. ఆడిన నాలుగు మ్యాచుల్లో ఓడిన ముంబై బోణీ కొట్టాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచులో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 క్రికెట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 9975 ప‌రుగులు చేసిన రోహిత్ శ‌ర్మ పంజాబ్ కింగ్స్ జట్లుతో జరిగే మ్యాచులో మరో 25 ర‌న్స్ చేస్తే.. పొట్టి ఫార్మాట్‌లో 10 వేల ప‌రుగులు పూర్తి చేస్తాడు. 25 రన్స్ చేస్తే.. టీ20 క్రికెట్‌లో 10 వేల ప‌రుగులు పూర్తి చేసిన రెండో భారత క్రికెట‌ర్‌గా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కుతాడు. టీ20 ఫార్మాట్‌లో రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ 10 వేల ప‌రుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 5691 ప‌రుగులు చేసిన రోహిత్.. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 3137 రన్స్ చేశాడు. 


టీ20 ఫార్మాట్‌లో 10వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్ అగ్ర స్థానంలో ఉన్నాడు. యూనివర్సల్ బాస్ 463 మ్యాచ్‌లు ఆడి..14562 పరుగులు చేశాడు. పాకిస్థాన్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్ 472 మ్యాచ్‌లు ఆడి 11698 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. కీరన్ పొలార్డ్ (582 మ్యాచుల్లో 11,452 పరుగులు), అరోన్ ఫించ్ (347 మ్యాచుల్లో 10,444 పరుగులు), విరాట్ కోహ్లీ (330 మ్యాచులలో 10,376 పరుగులు)లు వరుసగా ఉన్నారు. 


ఈ మ్యాచులో రోహిత్ శ‌ర్మను మరో రికార్డు కూడా ఊరిస్తోంది. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 499 ఫోర్లు కొట్టిన రోహిత్ మ‌రొక ఫోర్ బాదితే.. మెగా టోర్నీలో 500 ఫోర్లు పూర్తి చేసుకుంటాడు. ఓ ఫోర్ బాదితే శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా తర్వాత ఈ ఘనత అందుకున్న ఐదో ఆటగాడిగా నిలుస్తాడు. హిట్‌మ్యాన్ పంజాబ్ కింగ్స్‌తో ఆడే మ్యాచ్‌లోనే ఈ రికార్డును అందుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సీజన్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో రోహిత్ 80 పరుగులు మాత్రమే చేశాడు. అత్యుత్తమ స్కోరు 41.


Also Read: Ranbir-Alia wedding: నేడే రణ్‌బీర్‌, ఆలియా ఎంగేజ్మెంట్.. ముఖ్య అతిథిగా స్టార్ హీరోయిన్!


Also Read: AC Cooling Problem: సమ్మర్ లో ఏసీ కూలింగ్ పెరగాలంటే ఈ చిట్కాలు కచ్చితంగా పాటించండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook