Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయిన స్టార్ బ్యాటర్! ఏబీడీకి ఛాన్స్!!
Dewald Brevis replace Suryakumar Yadav. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దూరం అయ్యాడు. సూర్య స్థానంలో 18 ఏళ్ల యువ దక్షిణాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ ఆడనున్నాడు.
IPL 2022, Mumbai Indians batter Suryakumar Yadav miss Delhi Capitals Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ముంబై బ్రబౌర్న్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. లీగ్‌లో ఇరు జట్లకు ఇది తొలి మ్యాచ్. దాంతో విజయంతో టోర్నీని ఆరంభించాలని సీనియర్ కెప్టెన్ రోహిత్ శర్మ, నయా సారథి రిషబ్ పంత్ చుస్తున్నారు. గతేడాది లీగ్ దశను కూడా దాటలేకపోయిన ముంబై.. విజయమే లక్ష్యంగా ఈరోజు బరిలోకి దిగుతోంది. అయితే మ్యాచుకు ముందే ముంబైకి భారీ షాక్ తగిలింది.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దూరం అయ్యాడు. గాయం కారణంగా అతడు లీగ్ తొలి మ్యాచ్ ఆడడం లేదు. ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు సూర్య చేయి ఫ్రాక్చర్ అయింది. దాంతో అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందాడు. గాయం నుంచి కోలుకున్న సూర్య.. శనివారం ముంబై జట్టులో చేరాడు. అయితే గాయం నుంచి కోలుకున్న స్కై ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని సమాచారం.
సూర్యకుమార్ యాదవ్ దూరం కావడం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సూర్యకుమార్ స్థానంలో 18 ఏళ్ల యువ దక్షిణాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ ఆడనున్నాడు. ఇతగాడికి బేబీ ఏబీడీ అనే పేరు కూడా ఉంది. అండర్ 19 ప్రపంచకప్‌లో బ్రివీస్ దుమ్మురేపాడు. టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జూనియర్ ఏబీడీ నిలిచాడు. దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ రాణించిన అతడు 506 పరుగులు చేశాడు. బేబీ ఏబీడీ కాకూండా.. అన్మోల్‌ప్రీత్ సింగ్, ఫాబియన్ అలెన్ కూడా ఆడే అవకాశాలు ఉన్నాయి.
ముంబై తుది జట్టు (అంచనా):
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్/అన్మోల్ ప్రీత్ సింగ్, కీరన్ పొల్లార్డ్, టిమ్ డేవిడ్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్, జయదేవ్ ఉనద్కత్, ఎం అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా.
Also Read: CSK vs KKR Turning Point: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. అంతా జడేజానే చేశాడు!
Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ హాఫ్ సెంచరీ.. రాహుల్ ద్రవిడ్ రికార్డు బద్దలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook