Gujarat Titans Logo: ఐపీఎల్ 2022 లో కొత్తగా రెండు జట్లు ప్రవేశిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల టీమ్ ఇప్పటికే సిద్ధమైంది. ఈ నేపధ్యంలో గుజరాత్ టైటాన్స్ విడుదల చేసిన లోగో అందర్నీ ఆకట్టుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్  2022 మెగా ఆక్షన్ ముగిసింది. కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ పేర్లతో ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు సైతం ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ శక్తివంతమైన ప్లేయర్లను తీసుకుని ఐపీఎల్ పోరుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆరంగేట్రం ఇవ్వనున్న గుజరాత్ టైటాన్స్ జట్టు లోగోను విడుదల చేసింది. 


ఈ కొత్త లోగో గుజరాత్ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. ఎగిరే గాలిపటం ఆకారంలో లోగో రూపుదిద్దుకుంది. ఉన్నతమైన లక్ష్యాల్ని సాధించే జట్టుగా గుజరాత్ టైటాన్స్‌ను అభివర్ణించింది యాజమాన్యం. దీనికి సంకేతంగానే ఎగిరే గాలిపటాన్ని డిజైన్ చేశామన్నారు. గుజరాత్ సాంస్కృతిక వారసత్వంలో గాలిపటాలు ఓ భాగం. ఉత్తరాయణ పండుగ నాడు గాలిపటాలు ఎగురవేస్తారు. అందుకే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లోగో డిజైన్ చేశామన్నారు. అపరిమితమైన తమ జట్టు లక్ష్యాల్ని లోగో సూచిస్తుందన్నారు. ఆకాశాన్ని తాకే గాలిపటానికి ఎగరడమే తెలుసన్నట్టుగా గుజరాత్ టైటాన్స్ జట్టు అభివృద్ధి చెందుతుందన్నారు. 


ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా ఉన్నాడు. మెగా వేలం కంటే ముందే హార్ధిక పాండ్యాతో పాటు రషీద్ ఖాన్‌ను 15 కోట్లకు, శుభ్‌మన్ గిల్‌ను 8 కోట్లకు కొనుగోలు చేసుకుంది గుజరాత్ టైటాన్స్. వేలంలో మరో 52 కోట్లు ఖర్చు చేసి ఫెర్గూసన్, జేసన్ రాయ్, డేవిడ్ మిల్లర్, మాథ్యూవేడ్, రాహుల్ తెవాతియా వంటి విధ్వంసకర బ్యాటర్లను ఎంచుకుంది. 


Also read: IND vs WI: మూడో టీ20లో భారత్ ఘన విజయం.. పొట్టి సిరీస్ కూడా క్లీన్ స్వీప్! పాపం విండీస్ ఒక్క మ్యాచ్ గెలవదాయే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook