IPL 2022 Play off Race: ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్ రేసులో ఏ జట్లు, హైదరాబాద్, ఆర్ఆర్,ఆర్సీబీ, పంజాబ్‌లో ఎవరికి అవకాశాలు
IPL 2022 Play off Race: ఐపీఎల్ 2022లో టాప్ 4లో నిలిచే జట్లు ఏవి..గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే టాప్ 4లో దాదాపుగా ఉండగా..మిగిలిన రెండు స్థానాల కోసం ఆర్ఆర్, ఎస్ఆర్‌హెచ్, పీబీకేఎస్, ఆర్సీబీలు పోరాడనున్నాయి.
IPL 2022 Play off Race: ఐపీఎల్ 2022లో టాప్ 4లో నిలిచే జట్లు ఏవి..గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే టాప్ 4లో దాదాపుగా ఉండగా..మిగిలిన రెండు స్థానాల కోసం ఆర్ఆర్, ఎస్ఆర్‌హెచ్, పీబీకేఎస్, ఆర్సీబీలు పోరాడనున్నాయి.
ఐపీఎల్ 2022లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్ 8 మ్యాచ్‌లలో విజయం సాధించి 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే..లక్నో సూపర్ జెయింట్స్ 7 మ్యాచ్‌లు గెలిచి 14 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 మ్యాచ్‌లు గెలిచి 12 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. ఈ మూడు జట్లు ఇప్పటికే పది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 9 మ్యాచ్‌లు ఆడి 5 మ్యాచ్‌లు గెలిచింది. పది పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉంది. ఇక పంజాబ్, ఆర్సీబీ జట్లు పది మ్యాచ్‌లు ఆడి ఐదింట విజయంతో చెరో పది పాయింట్లు సాధించాయి. పాయింట్ల పట్టికలో 5, 6 స్థానాల్లో ఉన్నాయి.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్నా సరే..సర్వైవల్ కోసం పోరాడుతున్న కేకేఆర్ జట్టుపై గెలిచి మరో 2 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 9 మ్యాచ్‌లలో పది పాయింట్లు గెల్చుకుని ఇంకా అవకాశాలు పుష్కలంగా పెట్టుకుంది. విలియమ్సన్ నేతృత్వంలోని జట్టు తొలుత తత్తరపడినా..ఆ తరువాత పుంజుకుని టాప్ 4లో నిలిచింది. రన్‌రేట్ కూడా బాగుంది. గుజరాత్, సీఎస్కేలతో ఓడిపోయిన ఆ జట్టు తిరిగి కోలుకోవాలి.
ఇక పంజాబ్ జట్టు పది మ్యాచ్‌లలో పది పాయింట్లు సాధించి..అటు క్వాలిఫై ఇటు ఎలిమినేషన్ మధ్యన ఉందని చెప్పవచ్చు. ఈ జట్టుకు మిగిలిన మ్యాచ్‌లలో విజయం చాలా అవసరం. అందుకు తగ్గట్టుగానే గుజరాత్‌పై ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రానున్న మ్యాచ్‌లన్నీ కీలకమే. మరో రెండు మ్యాచ్‌లలో విజయం తప్పనిసరి.
ముంబై ఇండియన్స్ ఇప్పటికే రేసులోంచి తప్పుకోగా, ఢిల్లీకేపిటల్స్, కేకేఆర్, సీఎస్కే లు వరుసగా అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి. లేకపోతే రేసులోంచి పక్కకెళ్లిపోవల్సిందే.
Also read: MS Dhoni: ధోనీకి ప్రత్యామ్నాయం వెతకడం సీఎస్కేకు సాధ్యమేనా, ధోనీ తరువాత మరెవరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook