IPL 2022 Playoffs Chances, GT and LSG qualify: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 15వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా లీగ్ ముగింపు దశకు వచ్చినా.. ఇప్పటివరకు ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారు కాలేదు. ఇప్పటివరకు 13 మ్యాచులలో 10 విజయాలు అందుకున్న గుజరాత్ టైటాన్స్, 14 మ్యాచులలో 9 విజయాలు సాధించిన లక్నో సూపర్ జెయింట్స్ మాత్రమే ప్లే​ ఆఫ్స్‌ బెర్తు కన్ఫర్మ్‌ చేసుకున్నాయి. మిగిలిన రెండు స్థానాల కోసం ఐదు జట్లు పోటీలో ఉన్నాయి. ఆ సమీకరణాలు ఏంటో ఓసారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే 20 పాయింట్స్ ఉన్న గుజరాత్ టైటాన్స్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈరోజు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై విజయం సాధిస్తే 22 పాయింట్లు సాధిస్తుంది. ఒకవేళ ఓడినా కూడా గుజరాత్ టేబుల్‌ టాపర్‌గానే ఉంటుంది. లీగ్ దశలో అన్ని మ్యాచులు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్తుతం 18 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే నెట్ రన్ రేట్ కారణంగా మూడో స్థానంకు చేరుకుంటుంది. 


ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు రెండు ప్లే​ ఆఫ్స్‌ బెర్తులు ఖరారు కాగా.. మిగతా రెండు బెర్తుల కోసం ఐదు జట్లు పోటీలో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫేవరేట్‌గా ఉండగా.. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా రేసులో ఉన్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెగెలిసిందే. 


పంజాబ్ మరియు సన్‌రైజర్స్ జట్లకు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే అవకాశాలు 12.5% ​​మాత్రమే ఉన్నాయి. బెంగళూరు తమ చివరి మ్యాచ్‌లో గుజరాత్‌తో ఓడిపోవాలి. అదే సమయంలో ముంబై చేతిలో ఢిల్లీ ఓడాలి. ఇది జరిగితే పంజాబ్, సన్‌రైజర్స్ జట్లకు ప్లే​ ఆఫ్స్‌ అవకాశాలు ఉంటాయి. అప్పుడు పంజాబ్, సన్‌రైజర్స్ జట్ల మధ్య జరిగే మ్యాచులో గెలిచిన జట్టు 14 పాయింట్‌లతో ఢిల్లీ మరియు బెంగళూరుతో కలిసి నాలుగో స్థానంలో ఉంటుంది. అప్పుడు రన్ రేట్ పరిగణలోకి వస్తుంది. దాదాపుగా ఇది సాధ్యం కాకపోవచ్చు. 


చెన్నైపై రాజస్థాన్ గెలిస్తే నేరుగా ప్లే​ ఆఫ్స్‌ దక్కించుకుంటుంది.  ఒకవేళ ఓడితే.. ఢిల్లీ, బెంగళూరు జట్లు తమ చివరి మ్యాచులో భారీ తేడాతో గెలవొద్దు. ప్లే​ ఆఫ్స్‌ వెళ్లేందుకు రాజస్థాన్ జట్టుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఇక ఢిల్లీ తమ చివరి మ్యాచులో ముంబైపై గెలిస్తే నేరుగా ప్లే​ ఆఫ్స్‌ చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే బెంగళూరు కూడా గుజరాత్‌తో ఓడిపోతేనే అవకాశాలు ఉంటాయి. మరోవైపు చివరి గేమ్‌లో బెంగళూరు భారీ తేడాతో గెలిస్తేనే ప్లే​ ఆఫ్స్‌ వెళుతుంది. లేదంటే ఢిల్లీ భారీ తేడాతో ఓడిపోవాలి. 


Also Read: Puppy Bath Video: కుక్క పిల్లకి మొదటిసారి స్నానం..16 లక్షల మంది ఎందుకు చూసారో తెలుసా?


Also Read: Bank Recruitment: డిగ్రీ అర్హతపై కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరితేదీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook