Here is IPL 2022 Playoffs Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 చివరి అంకానికి చేరింది. ఇక లీగ్ దశలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం (మే 22)న సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకు నామమాత్రమే. ఎవరు గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇక లీగ్ దశ ముగియకున్నా.. శనివారం మ్యాచుతో ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారు అయ్యాయి. నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరగా.. ఆరు టీమ్స్ ఇంటి ముఖం పట్టాయి. ప్లే ఆఫ్స్‌కు చేరిన టీమ్స్.. క్వాలిఫయర్, ఎలిమినేటర్‌, ఫైనల్స్ కోసం కోల్‌కతా, అహ్మదాబాద్‌లకు బయలుదేరి వెళ్లనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 15వ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించాయి. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా గుర్తింపు పొందిన ముంబై, చెన్నై ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం. ఈసారి కొత్తగా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతంగా ఆడి ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి, మూడో స్థానంలో ఉన్నాయి. ఇక రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్, నాలుగులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి. 


తొలి క్వాలిఫయర్ మంగళవారం (మే 24) జరగనుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్, సంజు శాంసన్ నాయకత్వంలోని  రాజస్థాన్ రాయల్స్ జట్లు తొలి క్వాలిఫయర్‌లో తలపడతాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7:30కు ఈ మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. అందుకే ఇరు జట్లు గెలిచేందుకే చూస్తాయి. ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌ 2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. 


బుధవారం (మే 25)న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఢీ కొట్టనున్నాయి. ఈ మ్యాచ్లో ఓడిన జట్టు ఐపీఎల్ 2022 నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్‌ 2 ఆడాల్సి ఉంటుంది. అంటే క్వాలిఫయర్‌ 1లో ఓడిన జట్టుతో తలపడుతుంది. క్వాలిఫయర్‌ 2లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. రెండో క్వాలిఫయర్ ఈ నెల 27న ఉంటుంది. క్వాలిఫయర్‌ 1 ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్, ఫైనల్స్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఫైనల్ రాత్రి 8 గంటలకు జరగనుంది. 


Also Read: Monkeypox Virus: ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కలవరం.. 120 కేసులు నమోదు! డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక


Also Read: DC vs MI: ఢిల్లీ కేపిటల్స్ ఓటమికి కారణం రిషభ్ పంత్ తప్పుడు నిర్ణయమేనా, రిషభ్‌పై విమర్శలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook