IPL 2022: ఈ నెల 26 నుంచి ఐపీఎల్ 2022 ప్రారంభం కానుంది. ఐపీఎల్​ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది బీసీసీఐ. కాగా ఈ సారి పది టీమ్స్​ ఐపీఎల్​ ఆడనున్నాయి. ఇప్పటికే అన్ని టీమ్స్​ పక్కా ప్లాన్​తో కప్పు కొట్టేందుకు సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్ చెన్నై సూపర్​ కింగ్స్​ కోల్​కతా నైట్​ రైడర్స్ మధ్య జరగనుంది. అయితే ఈ సారి కప్​ ఎవరు కొడతారానే దానికన్నా ముందు.. ఆర్​సీబీ కెప్టెన్​ ఎవరు అనేదానిపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిగా మారిన విషయం. ఇప్పటి వరకు ఈ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించిన విరాట్​ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసింది. టీమ్​లో మాత్రం కొనసాగుతానని కోహ్లీ స్పష్టం గతంలోనే స్పష్టం చేశాడు. దీనితో కొత్త కెప్టెన్​ ఇప్పటికే ఎంపిక చేసేసింది ఆర్​సీబీ. అయితే దీనిపై నేడు అధికారికంగా ప్రకటన చేయనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కెప్టెన్​ పేరుతో పాటు కొత్త జెర్సీ కూడా..


ఆర్​సీబీ టీమ్​ నేడు మధ్యాహ్నం 3:45కు మీడియా సమావేశం నిర్వహించనుంది. ఇందులో కొత్త కెప్టెన్ పేరును ప్రకటించనుంది. ఆర్​సీబీ కొత్తగా ప్రారంభించిన బార్​, కేఫ్​లో ఈ ఈవెంట్​ జరగనుంది. దీనితో పాటు కొత్త లోగోతో కూడిన జెర్సీని కూడా విడుదల చేయనుంది ఆర్​సీబీ. ఇప్పటికే ఆర్​సీబీ కొత్త లోగోను విడుదల చేసిన విషయం తెలిసింది.


అయితే ప్రస్తుతం ఆర్​సీబీ కెప్టెన్సీ రేసులో దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్, ఆస్ట్రేలియన్ ఆల్​ రౌండర్ గ్లెన్​ మ్యాక్స్​వెల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.


ఆర్​సీబీ తొలి మ్యాచ్​ మార్చి 27న పంజాబ్​ కింగ్స్​తో ఆడనుంది. ఈ మ్యాచ్​తో కలిపి తొలి మూడు మ్యాచ్​లకు మ్యాక్స్​వెల్​ అందుబాటులో ఉండటం లేదు. అందుకే అతడికి కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీనితో ఆర్​సీబీ యాజమాన్యంతో పాటు, మాజీ కెప్టెన్ విరాట్​ కోహ్లీ కూడా ఫాఫ్​ డుప్లెసిస్​వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనిపై ఈ రోజు సాయంత్రానికి క్లారిటీ రానుంది.



ఆర్​సీబీ టీమ్ ఇదే..


ఆర్​సీబీలో ఈసారి.. విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్​వెల్​, ఫాప్​ డుప్లెసిస్​, మహమ్మద్ సిరాజ్​, దినేశ్​ కార్తిక్​, అంజు రావత్​, ఫిన్​ అలెన్​, ఆకాశ్​ దీప్​, జోష్​ హజ్లీవుడ్​, జేసన్ బెహ్రెండార్ఫ్, చామా మిలింద్, కర్ణ్ శర్మ, హర్షల్​ పటేల్​, వానిందు హసరంగా, షాబాజ్ అహ్మద్​, మహిపాల్ లోమ్రోర్​, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, సుయాష్ ప్రభుదేశాయ్​, అనీశ్వర్ గౌతమ్, డేవిడ్ విల్లీ, లువ్నిత్ సిసోడియా, సిద్ధార్థ్ కౌల్ ఉన్నారు.


Also read: IND vs SL 2nd Test: జయంత్ ఔట్.. సిరాజ్ ఇన్! జడేజా డౌట్! లంకతో డేనైట్ టెస్టులో బరిలోకి దిగే భారత జట్టిదే!!


Also read: IPL 2022 MS Dhoni: మహీనా మజాకా.. చెన్నైలోనే కాదు సూరత్‌లోనూ తగ్గేదేలే (వీడియో)!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook