Moeen Ali Run Out: అద్భుత ఫీల్డింగ్‌తో మొయిన్ అలీని రనవుట్ చేసిన ప్రభుదేశాయ్, వీడియో వైరల్
Moeen Ali Run Out: ఐపీఎల్ 2022లో జరిగిన 22 వ మ్యాచ్‌లో రెండు అద్భుతాలు. ఒకటి సీఎస్కే ప్లేయర్ అంబటి సెన్సేషనల్ క్యాచ్. మరొకటి ప్రభుదేశాయ్ అద్భుత ఫీల్డ్.. ఫలితంగా మొయిన్ అలీ రనవుట్..
Moeen Ali Run Out: ఐపీఎల్ 2022లో జరిగిన 22 వ మ్యాచ్‌లో రెండు అద్భుతాలు. ఒకటి సీఎస్కే ప్లేయర్ అంబటి సెన్సేషనల్ క్యాచ్. మరొకటి ప్రభుదేశాయ్ అద్భుత ఫీల్డ్.. ఫలితంగా మొయిన్ అలీ రనవుట్..
ఐపీఎల్ 2022లో 22 వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య సాగింది. ఐపీఎల్ 2022లో వరుసగా నాలుగు ఓటములతో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్ ఈసారి గెలవకతప్పని మ్యాచ్ ఇది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే అద్భుత ప్రదర్శనతో ఏకంగా 216 పరుగులు చేసింది. ఫలితంగా చివరి వరకూ పోరాడినా 23 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలు కాగా..సీఎస్కీ తొలి విజయం నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు అంబటి రాయుడు చేసిన ఫుల్ లెంగ్త్ డ్రైవ్ విత్ స్టన్నింగ్ క్యాచ్ ఎవరూ మర్చిపోలేరు. అదే సమయంలో ఇదే మ్యాచ్‌లో మరో అద్భుతం చోటుచేసుకుంది. అది ఆర్సీబీ ఆటగాడు ప్రభు దేశాయ్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో మొయిన్ అలీ వంటి దిగ్గజ ఆటగాడిని రనవుట్ చేయడం.
మొయిన్ అలీ రనవుట్ ఎలా
ఆర్సీబీ టీమ్ 6వ ఓవర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేశాడు. మొయిన్ అలీ బాల్‌ను బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపుకు ఆడాడు. అక్కడ హర్షల్ పటేల్ స్థానంలో తొలిసారిగా ఆడుతున్న ప్రభుదేశాయ్ ఉన్నాడు. దూరంగా వెళ్తున్న బంతిని డైవ్ చేసి పట్టుకున్నాడు. అటు స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న మొయిన్ అలీ ఓ రన్ పూర్తి చేయవచ్చనుకున్నాడు. కానీ అటు నాన్ స్ట్రైకిండ్ ఎండ్‌లో ఉన్న రాబిన్ ఊతప్ప వద్దని వారించి వెనక్కి పంపించాడు. ఈలోగా ప్రభుదేశాయ్ డైవ్ చేసి మరీ పట్టుకున్న బంతిని అలాగే నేరుగా వికెట్ కీపర్‌కు చేతికి అందేలా అద్భుతమైన త్రో చేశాడు. ఇంకేం...అక్కడున్న దినేష్ కార్తీక్ క్షణం ఆలస్యం చేయలేదు. ఆ బంతిని పట్టుకుని అలాగే మొయిన్ అలీని రనవుట్ చేశాడు. ప్రభుదేశాయ్ అటు బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. కేవలం 14 బంతుల్లో 34 పరుగులు చేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook