RCB vs MI: ముంబైకు మరో ఓటమి, 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం
RCB vs MI: ఐపీఎల్ 2022లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. గత ఛాంపియన్లు చేతులెత్తేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌కు వరుసగా మరో ఓటమి ఎదురైంది. ఆర్సీబీ ఘన విజయం నమోదు చేసింది.
RCB vs MI: ఐపీఎల్ 2022లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. గత ఛాంపియన్లు చేతులెత్తేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌కు వరుసగా మరో ఓటమి ఎదురైంది. ఆర్సీబీ ఘన విజయం నమోదు చేసింది.
ఐపీఎల్ 2022లో శనివారం జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడటంతో ముంబై ఇండియన్స్ ఈ స్కోరు చేయగలిగింది. ఓ దశలో 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 6 వికెట్లు కోల్పోయి..99 పరుగులు మాత్రమే చేసింది. సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో 18 ఓవర్లు ముగిసేసరికి..121 పరుగులకు చేరుకుంది. చివరి రెండు ఓవర్లలో మరింత దూకుడుగా ఆడి 30 పరుగులు చేర్చారు. దాంతో ముంబై ఇండియన్స్ జట్టు 151 పరుగులు చేయగలిగింది.
ఇక 152 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆర్సీబీ తరపున అనుజ్ రావత్, విరాట్ కోహ్లీలు అద్భుతంగా రాణించారు. ఆర్సీబీ జట్టు మొదట్నించి నిలకడగానే ఆడింది. తొలి వికెట్‌ను 8 ఓవర్ల తరువాతే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ రూపంలో పోగొట్టుకుంది. ఆ తరువాత విరాట్ కోహ్లీ సహకారంతో అనుజ్ రావత్ చక్కగా రాణించాడు. మ్యాచ్ చివర్లో పది పది బంతుల్లో 8 పరుగులు అవసరముండగా బరిలో వచ్చిన మ్యాక్స్‌వెల్ వరుస రెండు బౌండరీలతో ఆర్సీబీకు విజయాన్ని అందించాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ సీజన్‌లో వరుసగా 4వ ఓటమి.
Also read: RCB vs MI: చెలరేగి ఆడిన సూర్య కుమార్ యాదవ్... బెంగళూరు ముందు 152 పరుగుల లక్ష్యం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook