PBKS Vs RR: పంజాబ్ వర్సెస్ రాజస్థాన్.. ఇద్దరికీ కీలక మ్యాచ్.. ఎవరి బలమెంత..??
PBKS vs RR: ఐపీఎల్ 2022లో కీలకమైన మ్యాచ్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఏ జట్టు బలమెంతో పరిశీలిద్దాం..
IPL 2022 PBKS vs RR: ఐపీఎల్ 2022లో కీలకమైన మ్యాచ్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఏ జట్టు బలమెంతో పరిశీలిద్దాం..
ఐపీఎల్ 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్ లెవెన్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మరి కాస్పేపట్లో ముంబై వాంఖడే స్డేడియంలో ప్రారంభం కానుంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. రాజస్థాన్ రాయల్స్ జట్టు పది మ్యాచ్‌లు ఆడి ఆరింట విజయంతో 12 పాయింట్లు సాధించింది. ఇక పంజాబ్ కింగ్స్ లెవెన్ పది మ్యాచ్‌లు ఆడి ఐదింట విజయంతో పది పాయింట్లు గెల్చుకుంది. రెండు జట్లకు ఇవాళ జరిగే మ్యాచ్ నెంబర్ 52..పదకొండవ మ్యాచ్ కానుంది.
ఇప్పటి వరకూ ఈ రెండు జట్లలో 13 సార్లు రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించగా, పది సార్లు పంజాబ్ కింగ్స్ లెవెన్ గెలిచింది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నా..బౌలింగ్ తీసుకున్నా పెద్దగా తేడా ఉండదు. జోస్ బట్లర్ ఫుల్ ఫామ్‌లో ఉండటం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సానుకూలాంశం. బౌలింగ్ విషయంలో యజువేంద్ర చాహల్, అశ్విన్, కుల్దీప్ సేన్ అదనపు బలం. చాహల్ పంజాబ్‌పై ఇప్పటి వరకూ 25 వికెట్లు తీయడం మరో విశేషం.
ఇక పంజాబ్ విషయంలో లివింగ్‌స్టోన్, రాజపక్స, ధావన్ ఫామ్‌లో ఉండటంతో అనుకూలాంశం. వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోతున్న గుజరాత్‌ను ఓడించిన నైతిక స్థైర్యం పంజాబ్‌కు అదనపు బలం. పంజాబ్ బౌలర్ అర్షదీప్ సింగ్ బాగా రాణిస్తున్నాడు. ఇవాళ జోస్ బట్లర్‌ను త్వరగా అవుట్ చేయగలిగితే..పంజాబ్‌కు ప్రయోజనముంటుంది.
Also read: IPL 2022 Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు వేళాయే.. నాకౌట్ బరిలో నిలిచే టీమ్స్ ఇవేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు Twitter , Facebook క్లిక్ చేయండి.