SRH vs RR: ఓపెనర్లుగా రాహుల్, మార్కరమ్.. రొమారియోకే ఛాన్స్! రాజస్థాన్‌తో బరిలోకి దిగే సన్‌రైజర్స్ జట్టు ఇదే!
IPL 2022, SRH predicted Playing XI vs RR: గత సీజన్ వరకు ఓపెనింగ్ చేసిన డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలు లేకపోవడంతో.. ఈసారి కొత్త కాంబినేషన్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగనుంది. గతేడాది వరకు కోల్‌కతాకు ఆడిన రాహుల్ త్రిపాఠితో పాటుగా దక్షిణాఫ్రికా స్టార్ ఎయిడెన్ మార్కరమ్ ఓపెనర్‌గా రానున్నాడు.
IPL 2022, SRH predicted Playing XI vs RR: ఐపీఎల్ 2022లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ పోరు కోసం తెలుగు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత సీజన్ పరాభావాన్ని మరిచి గెలుపే లక్ష్యంగా కేన్ సేన బరిలోకి దిగుతోంది. అయితే ఈసారి జట్టు పూర్తిగా మారిపోయింది. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, మనీష్ పాండే, రశీద్ ఖాన్ లేకపోవడంతో సన్‌రైజర్స్ ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందా? అని ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11ను ఓసారి పరిశీలిద్దాం.
గత సీజన్ వరకు ఓపెనింగ్ చేసిన డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలు లేకపోవడంతో.. ఈసారి కొత్త కాంబినేషన్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగనుంది. గతేడాది వరకు కోల్‌కతాకు ఆడిన రాహుల్ త్రిపాఠితో పాటుగా దక్షిణాఫ్రికా స్టార్ ఎయిడెన్ మార్కరమ్ ఓపెనర్‌గా రానున్నాడు. ఈ ఇద్దరు మంచి ఫామ్‌లో ఉన్నారు. త్రిపాఠి దూకుడుగా ఆడినా.. మార్కరమ్ తనదైన శైలిలో మంచి ఇన్నింగ్స్ ఆడగలడు. మూడో స్థానంలో కెప్టెన్ కేన్ విల్లియంసన్ బరిలోకి దిగుతాడు.
నాలుగో స్థానంలో విండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ ఆడనున్నాడు. పూరన్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల భారత్ వేదికగా జరిగిన టీ20 సిరీస్‌లో వరుస హాఫ్ సెంచరీలు బాదాడు. పూరన్ చెలరేగితే ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరుగుండదు. 5, 6 స్థానాల్లో అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మలు బరిలోకి దిగుతారు. ఆల్‌రౌండర్ జాబితాలో మార్కో జాన్సెన్, రొమారియో షెఫర్డ్‌లో ఒకరు మాత్రమే ఆడనున్నారు. ఇప్పటికే ముగ్గురు విదేశీలు జట్టులో ఉండడంతో.. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన షెఫర్డ్‌కే ఆడే ఎక్కువ అవకాశాలున్నాయి. మరో ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉంటాడు.
భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ పేస్ విభాగంలో ఆడనున్నారు. గత కొన్నేళ్లుగా భువీ సన్‌రైజర్స్‌కు ఆడుతున్నాడు. ఇటీవల భారత జట్టులో చోటుదక్కించుకున్న అతడు సత్తాచాటాడు. నటరాజన్ మాత్రం గతేడాది కాలంగా ఫిట్‌నెస్ సమస్యతో సతమతమవుతున్నాడు. ఇటీవలి కాలంలో అతడు ఎక్కువగా మ్యాచులు ఆడలేదు. ఇది కాస్త కలవరపెట్టే అంశం. ఇక నెట్ బౌలర్‌గా జట్టులోకి వచ్చి.. అత్యంత వేగవంతమైన బంతులు వేస్తున్న మాలిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తానికి సన్‌రైజర్స్ జట్టు పటిష్టంగానే ఉంది. అందరూ సమిష్టిగా ఆడితే.. విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా):
రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (కీపర్), అబ్డుల్ సమద్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెఫర్డ్/మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.
Also Read: SRH vs RR: సరికొత్తగా సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎదురొచ్చిన జట్టును ఏసుకుంటూ పోవుడే ఇగ!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook