IPL 2022: ఐపీఎల్ 2022 మరి కొద్దిసేపట్లో ప్రారంభం, అంతా కొత్తగా, కొత్త నియమాలు, కొత్త మార్పులతో
IPL 2022: యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 వచ్చేసింది. మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 14 సీజన్లు దాటుకుని 15వ సీజన్‌లో అడుగుపెట్టింది. ఐపీఎల్ 2022 మాత్రం విభిన్న మార్పులతో ఉండనుంది.
IPL 2022: యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 వచ్చేసింది. మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 14 సీజన్లు దాటుకుని 15వ సీజన్‌లో అడుగుపెట్టింది. ఐపీఎల్ 2022 మాత్రం విభిన్న మార్పులతో ఉండనుంది.
ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్ సీజన్లు వేరు..ఇప్పుడు వేరు. ఐపీఎల్ సీజన్ 15లో అన్నీ మార్పులే. అంతా విభిన్నమే. ఫిబ్రవరిలో మెగా వేలం ముగించుకుని..కొన్ని కొన్ని మార్పులు చేసుకుని వివిధ ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. కొత్త కెప్టెన్లు రంగంలో దిగారు. కొత్త ఫ్రాంచైజీలు అడుగుపెట్టాయి. కొత్త నిబంధనలు వచ్చి చేరాయి.
ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఓ పండుగ. పూర్తి వినోదం లభించే ఆట. రసవత్తరంగా సాగే క్రీడ. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించే వేడుక. రెండు నెలల్లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈసారి ఐపీఎల్ స్వదేశంలోనే జరుగుతున్నా..కరోనా పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని..మ్యాచ్‌లను మహారాష్ట్రకే పరిమితం చేసింది బీసీసీఐ. ఆటగాళ్లు క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని..విమాన ప్రయాణాలు లేకుండా ముంబైలోని మూడు స్డేడియంలు, పూణేలోని ఒక స్డేడియంలో ఐపీఎల్ 2022 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈసారి 25 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి లభించనుంది.
రెండు కొత్త జట్లు ఎంట్రీ
ఐపీఎల్ అన్ని సీజన్లలో ఇప్పటి వరకూ 8 జట్లే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రెండు ఫ్రాంచైజీలు చేరుతున్నాయి. అంటే మొత్తం పది జట్లతో ఐపీఎల్ 2022 ఉంటుంది. ఆర్‌పీజీ గ్రూపుకు చెందిన లక్నో సూపర్ జెయింట్స్, సీవీసీ కేపిటల్స్‌కు చెందిన గుజరాత్ టైటాన్స్ జట్టులు కొత్తగా చేరాయి. ఫలితంగా మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 60కు బదులు 74 అయింది. ఈసారి డీఆర్సీ నిబంధనలు కూడా మారుతున్నాయి. రెండు సార్లు ప్రతి జట్టుకు అవకాశముంటుంది. మరోవైపు ప్లే ఆఫ్ సూపర్ ఓవర్ సమయంలోగా నిర్ణయం కాకపోతే..లీగ్ మ్యాచ్‌లో టాప్‌లో ఉన్న జట్టుకు ప్రాధాన్యత ఇస్తారు.
కొత్త ఫార్మట్
గతంలో ప్రతి టీమ్ రెండేసి సార్లు తలపడుతూ..మొత్తం 14 లీగ్ మ్యాచ్‌లు అడేది. ఇప్పుడు పది టీమ్‌లు కావడంతో ఫార్మట్‌లో మార్పులు చేసింది బీసీసీఐ. రెండు గ్రూపులుగా విభజించింది. ఒక్కొక్క టీమ్..గ్రూప్ లోని మిగిలిన నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు అంటే మొత్తం 8 మ్యాచ్‌లు ఆడుతుంది. మిగిలిన గ్రూప్ లోని ఒక టీమ్‌తో రెండు మ్యాచ్‌లు, మిగిలిన నాలుగు జట్లతో ఒక్కొక్క మ్యాచ్ అడనుంది.
కొత్త కెప్టెన్లు రంగంలో
మహేంద్ర సింగ్ ధోనీ హఠాత్తుగా కెప్టెన్సీ బాధ్యతల్నించి తప్పుకోవడంతో రవీంద్ర జడేడాకు సీఎస్కే సారధ్య బాథ్యతలు అప్పగించారు. కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌కు హార్ధిక్ పాండ్యా కెప్టన్‌గా ఉంటున్నాడు. పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ తొలిసారి బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. ఢిల్లీకు వీడ్కోలు చెప్పిన శ్రేయస్ అయ్యర్.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా కెరీర్ ప్రారంభించనున్నాడు. పంజాబ్‌ను వీడిన కేఎల్ రాహుల్..లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ఆర్సీబీ కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్ ఉండనున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook