IPL 2022 to begin on March 26: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022కు ముహూర్తం ఖరారు అయింది. ఐపీఎల్ 15వ సీజన్ మార్చి 26న ప్రారంభమవనుంది. ఈ మేరకు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. టోర్నీ అధికారిక బ్రాడ్‌కాస్టర్ అయిన డిస్నీ స్టార్ డిమాండ్ మేరకు మార్చి 26న క్యాష్ రిచ్ లీగ్‌ను ఆరంభించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అంగీకరించిందట. ఐపీఎల్ 2022 భారత్‌లోనే జరగనున్న విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (జీసీ) సమావేశం గురువారం (ఫిబ్రవరి 24) సాయంత్రం జరిగింది. వర్చువల్‌గా జరిగిన ఈ మీటింగ్‌లో బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. అధికారిక ప్రసార భాగస్వామి డిస్నీ స్టార్ అభ్యర్థన మేరకు శనివారం (మార్చి 26) టోర్నీని ఆరంభించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది. టోర్నమెంట్‌ను ఆదివారం (మార్చి 27) నుంచి ప్రారంభించాలని బీసీసీఐ చూసినా.. ఒకరోజు ముందుగానే స్టార్ట్ చేయమని స్టార్ కోరిందట.


ఐపీఎల్ 2022 లీగ్ దశలోని అన్ని మ్యాచ్‌లను మహారాష్ట్రలోనే నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకరించింది. మ్యాచ్‌లు ముంబైలోని మూడు, పుణెలోని ఒక స్టేడియంలో జరగనున్నాయి. మార్చి 26 నుంచి మహారాష్ట్రలోనే ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభమవుతుందని, త్వరలోనే పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ఓ ప్రకటలో పేర్కొన్నారు. ఇక కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈసారి స్టేడియంకు ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని, అయితే ఎంత శాతంను అనుమతిస్తారనేది మహారాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని ఆయన చెప్పారు. 


రెండు కొత్త జట్లు ఈసారి వచ్చిన నేపథ్యంలో మ్యాచ్‌ల సంఖ్య 74కి పెరగనుంది. 15వ సీజన్‌కి మహారాష్ట్రలోని ముంబై, పూణే నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ముంబైలో 55 మ్యాచులు, పూణేలో 15 మ్యాచులు జరుగుతాయి. వాంఖడే స్టేడియంలో 20 మ్యాచులు, బ్రాబోన్ స్టేడియంలో 15 మ్యాచులు, డివై పాటిల్ స్టేడియంలో 20 మ్యాచులు జరుగుతాయి. ఇక మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) మైదానంలో 15 మ్యాచులు జరగనున్నాయి. 


Also Read: Reena Dwivedi New Look: అప్పుడు ఎల్లో సారీ.. ఇప్పుడు వెస్ట్రన్ డ్రెస్‌! ఈ ఎలక్షన్ ఆఫీసర్‌ది చూపుతిప్పుకోని అందం!!


Also Read: Bigg Boss OTT Promo: మీ మొబైల్స్ ఫుల్ ఛార్జ్ పెట్టుకోండి.. నో కామ, నో ఫుల్‌స్టాప్: నాగార్జున


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook