SRH vs LSG: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో పరాజయం ఎదురైది. అవేశ్ ఖాన్ చెలరేగడంతో..లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఓటమి పాలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఊహించని విధంగా గతంలోని ఛాంపియన్లు కోలుకోలేకపోతున్నారు. అదే సమయంలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రెండు టీమ్‌లు సత్తా చాటుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో లక్నో విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ జట్టుకు ఈ టోర్నీలో వరుసగా రెండవ ఓటమి ఎదురైంది. 


టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది. కెప్టెన్ రాహుల్ 68 పరుగులు, దీపక్ హుడా 51 పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాటర్లు రాణించకపోవడంతో లక్నో భారీ స్కోరు చేయలేకపోయింది. ఆ తరువాత బరిలో దిగిన ఎస్ఆర్‌హెచ్ జట్టు 170 పరుగుల లక్ష్యం సాధించలేక చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి..కేవలం 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాహుల్ త్రిపాఠి 44 పరుగులు, నికోలస్ పూరన్ 34 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. 


లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో అవేశ్ ఖాన్ చెలరేగడంతో ఎస్ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. అవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా..హోల్డర్ 3 వికెట్లు తీశాడు. అబ్దుల్ సమద్, నికోలస్ పూరన్, కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మలను పెవిలియన్ బాట పట్టించాడు. కీలకమైన ఆటగాళ్లను అవుట్ చేసిన అవేశ్ ఖాన్..లక్నో సూపర్ జెయింట్స్ జట్టు విజయానికి కారకుడయ్యాడు.


వాస్తవానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఈ మ్యాచ్ కీలకం. ఎందుకంటే ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడిపోయింది. ఇప్పుడు వరుసగా రెండవ మ్యాచ్‌లో కూడా అదే అవేశ్ ఖాన్ దెబ్బకు ఓటమి పాలైంది. అదే సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇప్పటి వరకూ మూడింట రెండు మ్యాచ్‌లు గెలిచి 4 పాయింట్లతో ఉంది. 


Also read: IPL 2022 Points Table: పాయింట్ల పట్టికలో ఏ టీమ్ స్థానమెంత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook