IPL 2022: ప్రతిభ కలిగిన ఆటగాళ్లతో కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ ఫుల్‌ స్ట్రాంగ్‌ గా ఉంది. ఇప్పటివరకు రెండుసార్లు ఛాంపియన్‌ గా నిలిచిన కోల్‌ కతా ఈ సారి హాట్‌ ఫేవరెట్‌ గా బరిలోకి దిగుతోంది. శ్రేయస్‌ అయ్యర్‌ ను భారీ ధరకు కొనుగోలు చేసి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది కేకేఆర్‌ ఫ్రాంఛైజీ. మరి శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని జట్టు ఈ సారి ఛాంపియన్‌ గా నిలుస్తుందా.. లేక నిరాశపరుస్తుందో చూడాలి.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2022 ఐపీఎల్‌ కు సంబంధించి కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ ను ముమ్మరం చేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ముంబై చేరుకున్న ఆటగాళ్లు.. నెట్స్‌ లో కఠోర సాధన చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన 14 ఎడిషన్లలో కేకేఆర్‌.. పర్వాలేదనిపించింది. అయితే కీలక సమయాల్లో కోల్‌ కతా ఆటగాళ్లు చేతులెత్తయడంతో గెలిచే అనేక మ్యాచ్‌ ల్లో ఓడిపోయింది. కేకేఆర్‌ జట్టు 2012, 2014లో గౌతమ్‌ గంభీర్‌ కెప్టెన్‌ గా ఉన్నసమయంలో ఛాంపియన్‌ గా నిలిచింది. 2021లో అద్భుత ప్రదర్శన చేసిన ఆ టీం.. ఫైనల్‌ వరకు చేరినా... విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. చెన్నై చేతిలో ఓటమిపాలై.. రన్నరప్‌ గా నిలిచింది. 


గత సీజన్‌ లో కేకేఆర్‌ జట్టులో కీలక ఆటగాళ్లు ఉన్నారు. గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, ప్రసిద్ధ్‌ కృష్ణ లాంటి ప్లేయర్లు ఇప్పుడు ఆ జట్టుకు దూరమయ్యారు. గతేడాది ఫామ్‌ లో లేని హర్డ్‌ హిట్టర్‌ రస్సెల్‌ ను మరోసారి రీటెయిన్‌ చేసుకుంది కేకేఆర్‌. అతనితో పాటు సునీల్‌ నరైన్‌, ఆల్‌ రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌, వరుణ్‌ చక్రవర్తిని కూడా కేకేఆర్‌.. వేలంలోకి వెళ్లకుండా కాపాడుకుంది.శ్రేయస్‌ అయ్యర్‌ను కేకేఆర్‌ పన్నెండున్నర కోట్లకు కొనుగులు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. 


శ్రేయస్‌ తో పాటు జట్టులో వెంకటేశ్‌ అయ్యర్, రస్సెల్‌, చమిక కరుణరత్నె, సునిల్‌ నరైన్, నితీశ్ రాణా, ప్యాట్ కమిన్స్, మహమ్మద్ నబీ, అంజిక్య రహానె కీలకంగా ఉన్నారు. బౌలింగ్‌ విభాగాల్లో ఆస్ట్రేలియన్‌ పేసర్‌ కమిన్స్‌ తో పాటు ఉమేశ్‌ యాదవ్‌, శివమ్‌ మావి, సౌథీ కీలకం కానున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో సునిల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ కు టీంలో చోటు తప్పక ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.


Also Read: RRR: ఇండియన్ సినీ హిస్టరీలో 'ఆర్ఆర్ఆర్' సంచలనం కాబోతుందా.. వసూళ్ల పరంగా పాత రికార్డులన్నీ బద్దలవుతాయా..


Also Read: China Flight Crash: చైనా విమాన ప్రమాదంలో ఎవరూ బతకలేదా..కొండపై చెలరేగుతున్న మంటలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook