RCB vs DC: ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ విజయ పరంపర కొనసాగుతోంది. ఢిల్లీ కేపిటల్స్ జట్టుపై 16 పరుగుల తేడాతో మరో విజయం సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో శనివారం జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో విజయం సాధించింది. ముంబై వాంఖేడ్ స్డేడియంలో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ సేన 16 పరుగుల తేడాతో ఢిల్లీ కేపిటల్స్‌పై గెలిచింది. 


తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. వాస్తవానికి ఆర్సీబీ జట్టు ప్రారంభంలో చాలా తడబడింది. ఫాఫ్ డుప్లెసిస్, అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ వికెట్లను 40 పరుగుల్లోపే కోల్పోయింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ధాటిగా ఆడటంతో ఇన్నింగ్స్ కోలుకుంది. ఆ తరువాత 55 పరుగుల వద్ద షాట్‌కు ప్రయత్నించి క్యాచవుట్ అయ్యాడు. ఓ దశలో 15 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు కేవలం 120 పరుగులు మాత్రమే. ఇక అక్కడ్నించి దినేష్ కార్తీక్ భారీ షాట్లతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు. ముస్తఫీజుర్ రెహ్మాన్ వేసిన 18వ ఓవర్ ఆర్సీబీకు బాగా కలిసొచ్చింది. ఈ ఓవర్లో దినేష్ కార్తీక్ ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. అదే ఢిల్లీ కేపిటల్స్ జట్టు కొంప ముంచింది. 


ఆ తరువాత 190 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు పూర్తిగా తడబడింది. ఆ జట్టులో డేవిడ్ వార్నర్ తప్ప మరెవరూ రాణించలేదు. వార్నర్ బరిలో ఉన్నంతసేపు ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు విజయంపై ఆశలు పెట్టుకున్నా.. ఆ తరువాత ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో ఇక ఢిల్లీ జట్టు ఆశలు వదిలేసుకుంది. డేవిడ్ వార్నర్ 66 పరుగులు చేశాడు. ఢిల్లీ కేపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి..173 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఐపీఎల్ 2022 టీ 20 పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 8 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. మొత్తం 6 మ్యాచ్‌లు ఆడి..4 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇక పాయింట్ల పట్లికలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు టాప్ 2లో నిలిచాయి. ఢిల్లీ కేపిటల్స్ జట్టు చివర్నించి మూడవ స్థానంలో ఉంది. 


Also read: MI vs LSG, IPL 2022: కేఎల్ రాహుల్ సెంచరీ, మళ్లీ ఓడిన ముంబయి ఇండియన్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook