ఐపీఎల్ 2023కు ఇంకా చాలా సమయం ఉంది. కానీ మినీ వేలం మాత్రం మరి కొద్దిరోజుల్లోనే జరగనుంది. కొచ్చి వేదికగా ఈనెల 23న జరగనున్న వేలానికి విదేశీ ఆటగాళ్లు పెద్దఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీసీసీఐ ప్రతియేటా నిర్వహించే ఐపీఎల్ టీ20 కోసం జరిగే ఆటగాళ్ల వేలం అందరి దృష్టీ ఆకర్షిస్తుంటుంది. సిరులు కురిపిస్తున్న టోర్నీ కావడంతో ఐపీఎల్ టీ20పై విదేశీ ఆటగాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు ఐపీఎల్ 2023 కోసం మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. ఏ ఆటగాళ్లు ఎంపిక కానున్నారు, ఎవరు ఎంత ధర పలకనున్నారనేది ఆ రోజే తేలనుంది. బీసీసీఐ నిర్వహించే ఈ వేలం కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా..ఇందులో 277 మంది విదేశీయులున్నారు. 


ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల్నించి ఏకంగా 109 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి అత్యదికంగా 57 మంది, దక్షిణాఫ్రికా నుంచి 52 మంది వేలంలో ఉంటారు. నవంబర్ 15న మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ లిస్ట్ విడుదల చేశాయి. మొత్తం 991 మంది ఆటగాళ్లుండగా, 714 మంది భారతీయులున్నారు. వీరిలో 19 క్యాప్డ్ ఆటగాళ్లున్నారు. ఇక విదేశీ ఆటగాళ్లు 277 మంది కాగా 166 మంది క్యాప్డ్ ఆటగాళ్లున్నారు. ఒక్కొక్క ఫ్రాంచైజీ గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను కలిగి ఉండవచ్చు. వెస్టిండీస్ నుంచి 33 మంది, న్యూజిలాండ్ నుంచి 27, శ్రీలంక నుంచి 23, ఇంగ్లండ్ నుంచి 31 మంది ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి 14 మంది, బంగ్లాదేశ్ నుంచి 6 మంది, ఐర్లండ్ నుంచి 8, నమీబియా నుంచి 5, నెదర్లాండ్స్ నుంచి 7, స్కాట్లండ్ నుంచి 2, యూఏఈ నుంచి 6, జింబాబ్వే నుంచి 6 మంది ఉన్నారు. 


Also read: IND Vs BAN: బంగ్లాదేశ్‌తో టీమిండియా పోరు.. స్పిన్నర్లకు పండగే.. పిచ్ రిపోర్ట్ ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook