ఐపీఎల్ 2023 సీజన్ 16 మినీ వేలం మరి కొద్దిగంటల్లో కొచ్చి వేదికగా ప్రారంభం కానుంది. కొందరు ఆటగాళ్లు వివిధ జట్లలో స్థానం సంపాదించుకోవడమే కాకుండా..కొంతమంది కెప్టెన్లు కావచ్చు కూడా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2023 సీజన్ 6 రేపు జరగనున్న వేలంతో పాటు ముగ్గురు కీలకమైన ఆటగాళ్లు కెప్టెన్ అయ్యే అవకాశాలున్నాయి. ఐపీఎల్ 2023 సీజన్ 6 కోసం ఇప్పటికే 403 మంది ఆటగాళ్లు స్టార్ లిస్ట్ అయ్యారు. కెప్టెన్ జాబితాలో బెన్ స్టోక్స్, కేన్ విలియమ్సన్, జేసన్ హోల్డర్ ఉన్నారు. 


బెన్ స్టోక్స్


ప్రాధమిక ధర 2 కోట్ల రూపాయలు. గత ఐపీఎల్ సీజన్‌లో పాల్గొనలేదు. ఈసారి వేలంలో భారీ ధర పలికే అవకాశాలున్నాయి. జో రూట్ రాజీనామా తరువాత ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ సమర్ధవంతంగా ఆడుతోంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు కెప్టెన్ కోసం చూస్తున్నాయి. బెన్ స్టోక్స్‌ను తీసుకునే అవకాశాలున్నాయి.


కేన్ విలియమ్సన్


న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇబ్బందుల్లో ఉన్నాడు. కెప్టెన్సీ పరంగా ఇటు ఆటతీరుతో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇతడిని వదులుకుంది. అయితే ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ సెమీఫైనల్స్‌కు చేరుకుంది. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు కేన్ విలియమ్సన్‌ను తీసుకునే అవకాశాలున్నాయి.


జేసన్ హోల్డర్


వెస్టిండీస్‌కు చెందిన ప్రతిభావంతుడైన ఆటగాడు జేసన్ హోల్డర్. జట్టు తరపున మంచి ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్ జేసన్ హోల్డర్‌ను 8.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి కెప్టెన్ అయ్యే అవకాశాలున్నాయి.


Also read: Team India: మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డు గెలిచినా టీమ్‌ నుంచి ఔట్.. ఈ ప్లేయర్లను వెంటాడిన దురదృష్టం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook