IPL Mini Auction: సెహ్వాగ్ మేనల్లుడుపై కాసుల వర్షం.. వేలంలో దక్కించుకున్న సన్‌రైజర్స్
Virender Sehwag Nephew: టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మేనల్లుడు మయాంక్ దాగర్ ఐపీఎల్ మినీ వేలంలో తన బేస్ ధర కంటే 9 రెట్లు ఎక్కువ దక్కించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ యంగ్ ఆల్‌రౌండర్ కోసం పోటీ జరిగింది. చివరకు ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది.
Virender Sehwag Nephew: ఐపీఎల్ మినీ వేలం ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించింది. కొందరు ఆటగాళ్లను ఊహించని ఫ్రాంచైజీలు ఊహించని ధరకు కొనుగోలు చేశాయి. మరికొందరు స్టార్ ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా యంగ్ ఆల్‌రౌండర్ శామ్ కర్రాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. రూ.18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. గతంలో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ఆడాడు. ఇక ఈ వేలంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మేనల్లుడు కూడా కాసుల వర్షం కురిపించాడు. 26 ఏళ్ల ఆల్‌రౌండర్ మయాంక్ దాగర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
తండ్రి కూడా క్రికెటర్
ఢిల్లీలో జన్మించిన మయాంక్ దాగర్ సిమ్లా పాఠశాలలో చదివాడు. మయాంక్ తండ్రి జితేంద్ర దాగర్ కూడా యూనివర్సిటీ స్థాయిలో క్రికెట్ ఆడారు. ప్రస్తుతం మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD)లో కాంట్రాక్టర్‌గా ఉన్నారు. మయాంక్‌కి టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మేనమామ అవుతాడు. మయాంక్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు. ఇటీవల ఢిల్లీలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో మయాంక్ 7వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 92 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
రాజస్థాన్‌తో పోటీ..
మయాంక్ దాగర్ కోసం బిడ్డింగ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య గట్టి పోటీ జరగింది. అతని బేస్ ధర రూ.20 లక్షలు. దానిపై హైదరాబాద్ వేలం వేసింది. అప్పుడు రాజస్థాన్ 25, 35, 95 లక్షల వరకు వేలం వేసింది. హైదరాబాద్ రూ.కోటి వేలం వేయగా.. చివరకు రూ.1.7 కోట్లకు బిడ్ వేసి రాజస్థాన్ చేతులెత్తేసింది. ఎట్టకేలకు రూ.1.8 కోట్ల బిడ్‌తో హైదరాబాద్ అతడిని సొంతం చేసుకుంది.
ఫస్ట్ క్లాస్ కెరీర్ సత్తా..
మయాంక్ దేశవాళీ క్రికెట్‌లో హిమాచల్ ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో 87 వికెట్లు పడగొట్టి మొత్తం 732 పరుగులు చేశాడు. తన మొత్తం టీ20 కెరీర్‌లో మయాంక్ ఇప్పటివరకు 44 మ్యాచ్‌లలో 44 వికెట్లు పడగొట్టాడు . 72 పరుగులు చేశాడు. లిస్ట్ ఎలో 46 మ్యాచ్‌లు ఆడి 51 వికెట్లు తీశాడు. దీంతో పాటు హాఫ్ సెంచరీ సాయంతో లిస్ట్ ఎలో మొత్తం 393 పరుగులు కూడా చేశారు. ఈ ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించి మామకు తగ్గ అల్లడుని నిరూపించుకుంటాడో లేదో చూడాలి మరి.
Also Read: IPL 2023 Auction: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే.. టీమిండియా నుంచి ఒక్కడే
Also Read: Nasal Vaccine: కొత్త వేరియంట్ భయందోళనలు.. బూస్టర్ డోస్ నాజల్ వ్యాక్సిన్ వచ్చేసింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook