ఐపీఎల్ 2023 మినీ ఆక్షన్‌కు కీలకమైన ప్రక్రియ పూర్తయింది. దేశంలోని 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్ల జాబితాను విడుదల చేయడంతో..ఇక వేలంలో ఎవరుండేది తేలిపోయింది. ఎవరి పర్సులో ఎంతుందో స్పష్టమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2023 మినీ వేలం డిసెంబర్ 23వ తేదీన జరగనుంది. వేలానికి ముందు వివిధ ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితాను అందించాల్సిందిగా బీసీసీఐ ఆదేశించింది. బీసీసీఐ ఆదేశాల ప్రకారం..నవంబర్ 15 అంటే ఇవాళ్టిలోగా జాబితాలను సమర్పించాల్సి ఉంది. ఇందుకు తగ్గట్టే ఫ్రాంచైజీలు ఆటగాళ్లను విడుదల చేశాయి. కొందరిని రిటైన్ చేసుకున్నాయి. ఫలితంగా వివిధ ఫ్రాంచైజీల పర్సు పెరిగింది. అత్యధికంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పర్సు తూగుతోంది. 


సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విలియమ్సన్, నికోలస్ పూరన్ వంటి విదేశీ ఆటగాళ్లను విడుదల చేసిన తరువాత..42.25 కోట్లను కలిగి ఉంది. ఇప్పుడీ జట్టుకు నలుగురు విదేశీ ఆటగాళ్ల స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.


పంజాబ్ కింగ్స్ జట్టు గత సీజన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను విడుదల చేసింది. ఆ తరువాత ఈ జట్టు పర్సు 32.20 కోట్లకు చేరుకుంది. ముగ్గురు విదేశీ ఆటగాళ్ల స్లాట్లు మిగిలున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఇప్పుడు 4 విదేశీ ఆటగాళ్ల ఖాళీలున్నాయి. జట్టు పర్సు విలువ 23.35 కోట్లకు చేరుకుంది. 


ఇక చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే వంటి ఆటగాళ్లను వదిలేసింది. దాంతో ఆ జట్టు పర్సు విలువ 20.45 కోట్లకు చేరుకుంది. ఈ జట్టులో ఇప్పుడు విదేశీ ఆటగాళ్లు ఇద్దరు మిగిలున్నారు. ఇక ఢిల్లీ కేపిటల్స్ జట్టు శార్దూల్ ఠాకూర్‌ను విడుదల చేసిన తరవాత 19.45 కోట్లుంది. ఇద్దరు విదేశీ ఆటగాళ్లకు స్థానముంది.


గుజరాత్ టైటాన్స్ జట్టు ఫెర్గూసన్, రహ్మానుల్లా గుర్బాజ్‌లను విడుదల చేయగా..19.25 కోట్లు మిగిలుంది. ఇప్పుడీ జట్టులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లకు ప్లేస్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు పర్సు విలువ ఇప్పుడు 13.20 కోట్లకు చేరుకుంది. ఈ జట్టులో ఇప్పుడు నలుగురు విదేశీ ఆటగాళ్లకు స్థానముంది.


ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కేవలం 8.75 కోట్లే మిగిలుంది. ఈ జట్టులో ఇప్పుడు ముగ్గురు విదేశీ ఆటగాళ్లకు స్థానముంది.  కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు వద్ద అత్యల్పంగా 7.05 కోట్లు మాత్రమే ఉంది. ఈ జట్టులో ఇప్పుడు ముగ్గురు విదేశీ ఆటగాళ్లకు స్థానముంది.


Also read: CSK Retained Players List: స్టార్ ఆటగాడికి హ్యాండిచ్చిన చెన్నై సూపర్ కింగ్స్.. సీఎస్‌కే రిటెన్షన్ లిస్ట్ ఇదే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook