IPL 2023 Retention, Sunrisers Hyderabad Retained and Released Players List for IPL 2023: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) ప్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ గత 2-3 సీజన్లుగా చెత్త ఆటతో తెలుగు అభిమానులను నిరాశ పరుస్తున్న విషయం తెలిసిందే. ప్లేఆఫ్‌కు చేరుకోవడంలో వరుసగా విఫలమవుతోంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. 2021 ఎడిషన్‌లో డేవిడ్ వార్నర్‌ను తొలగించి.. కేన్ విలియమ్సన్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించినా ఫలితం లేకుండా పోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేన్ విలియమ్సన్ జట్టు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బ్యాటర్‌గా విఫలమయ్యాడు. ఐపీఎల్ 2022లో కేన్ మామ 19.64 సగటు మరియు 93 స్ట్రైక్ రేట్‌తో 216 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్సీ కూడా తన స్థాయికి తగ్గట్టుగా లేదు. కోట్లు పెట్టి కొన్న నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్ లాంటి స్టార్ ఆటగాళ్లు కూడా రాణించలేదు. అందుకే 2023 ఎడిషన్‌కు ముందు కొత్త జట్టును తయారుచేసుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ కసరత్తులు చేస్తోందట. ఇందులో భాగంగానే 2022లో ఆడని స్టార్ ఆటగాళ్లను కూడా సన్‌రైజర్స్ వదులుకునేందుకు సిద్దమైందట. 


కొచ్చి వేదికగా డిసెంబరు 23న ఐపీఎల్ 2023 ఆక్షన్‌ బీసీసీఐ నిర్వహించనుంది. ఈ  నేపథ్యంలో తమతో అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలు సమర్పించేందుకు మంగళవారం (నవంబరు 15) ఆఖరి రోజు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల  జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. రిలీజ్ ప్లేయర్స్ జాబితాలో కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్, కార్తీక్ త్యాగి ఉన్నట్లు తెలుస్తోంది. ఐడెన్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్ లాంటి విదేశీ ఆటగాళ్లను అట్టిపెట్టుకుందట. 


రిటైన్ ప్లేయర్స్ లిస్ట్:
ఐడెన్ మార్క్రమ్
అబ్దుల్ సమద్
రాహుల్ త్రిపాఠి
గ్లెన్ ఫిలిప్స్
అభిషేక్ శర్మ
మార్కో జాన్సెన్
భువనేశ్వర్ కుమార్
జగదీశ సుచిత్
టి నటరాజన్
ఉమ్రాన్ మాలిక్


రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్:
కేన్ విలియమ్సన్
నికోలస్ పూరన్
రొమారియో షెపర్డ్
సీన్ అబాట్
కార్తీక్ త్యాగి


Also Read: నా చిన్ననాటి మరో పేరు చెరిగిపోయింది.. కృష్ణ మృతిపై స్టార్ కామెంటేటర్ సంతాపం!


Also Read: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. టీమిండియా కోచ్, డైరెక్టర్‌గా కొత్త బాధ్యత!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook