GT vs RCB Highlights: ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను మడతపెట్టేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మరో అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండో విజయాన్ని దక్కించుకుంది. గుజరాత్‌ టైటాన్స్‌పై సమష్టి ప్రదర్శన కనబర్చి మ్యాచ్‌ను దక్కించుకుంది. 24 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఆర్‌సీబీ విజయం సాధించినా పాయింట్ల పట్టికలో మాత్రం అట్టడుగున కొనసాగుతోంది. ఈ విజయంతో ఆడిన పది మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: RCB vs SRH Highlights: ఏం జరిగింది? సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌.. హైదరాబాద్‌ను బెంబేలెత్తించిన బెంగళూరు


అహ్మదాబాద్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింఇ. వృద్ధిమాన్‌ సాహ (5), కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (16) భారీ స్కోర్‌ చేయడంలో విఫలమైన వేళ సాయి సుదర్శన్‌ గొప్ప ప్రదర్శన చేశాడు. 49 బంతుల్లో 84 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు భారీ స్కోర్‌ అందించాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో సుదర్శన్‌ మైదానంలో చివరి బంతి వరకు నిలబడి కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. సుదర్శన్‌కు తోడుగా నిలిచిన షారూక్‌ ఖాన్‌ 58 పరుగులతో రెచ్చిపోయి ఆడాడు. అనంతరం వచ్చిన డేవిడ్‌ మిల్లర్‌ 26 పరుగులతో పర్వాలేదనిపించాడు. బెంగళూరు బౌలర్లు పరుగులను నియంత్రిస్తూనే చక్కటి బౌలింగ్‌ వేస్తూ సాధారణ స్కోర్‌ ఇచ్చారు. స్వప్నిల్‌ సింగ్‌, మహ్మద్‌ సిరాజ్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

Also Read: IPL 2024 Live RR vs MI : ఐపీఎల్‌లో తిరుగులేని రారాజు 'రాజస్థాన్‌'.. యశస్వి జైస్వాల్‌ దెబ్బకు ముంబై ఓటమి


 


సాధారణ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన బెంగళూరు సునాయాసంగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఒక వికెట్‌ కోల్పోయి 16వ ఓవర్‌కే మ్యాచ్‌ను ముగించి విజయం సాధించింది. విల్‌ జాక్స్‌ అద్భుత శతకానికి తోడు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో జట్టు వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. విల్‌ జాక్స్‌ 41 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 10 సిక్స్‌లతో రెచ్చిపోగా.. 4 ఫోర్లు చేసి శతకాన్ని సాధించాడు.

ఇక కోహ్లీ 44 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టుకు జట్టును నెగ్గించాడు. ఫాస్‌ డుప్లెసిస్‌ 24 పరుగులకు పరిమితమైంది. బెంగళూరును పరుగులు సాధించకుండా గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లు ఏమాత్రం నియంత్రించలేకపోయారు. రవిశ్రీనివాసన్‌ సాయి కిశోర్‌ మినహా ఒక్క బౌలర్‌ కూడా వికెట్‌ తీయలేకపోయారు. పది మ్యాచ్‌లు ఆడి 4 విజయాలు.. 6 ఓటములతో గుజరాత్‌ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter