MS Dhoni: ధోని మాస్టర్ ప్లాన్‌కు షాకైన కావ్య మారన్.. పక్కా ప్లాన్‌తో ట్రావిస్ హెడ్‌కు గాలం
CSK Vs SRH Highlights: చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ జోరు పెంచింది. వరుస రెండో ఓటముల తరువాత గెలుపు రుచి చూసింది. ఎస్ఆర్హెచ్పై 78 పరుగులతో తేడాతో గెలుపొంది.. పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసేందుకు ఎంఎస్ ధోనీ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
CSK Vs SRH Highlights: సూపర్ ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 78 పరుగులతో తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (98) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. డారెల్ మిచెల్ (52) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శివమ్ దుబే (39 నాటౌట్) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్.. కేవలం 134 పరుగులకే ఆలౌట్ అయింది. మార్క్రామ్ (32) మినహా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే నాలుగు వికెట్లు పడగొట్టి.. చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముస్తిఫిజూర్ రెహ్మన్, మతీషా పతిరణ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, ఠాకూర్ తలో వికెట్ తీశారు.
Also Read: TS SSC Results 2024: రేపే టెన్త్ ఫలితాలు.. డైరెక్ట్‌గా ఈ లింక్‌పై క్లిక్ చేయండి
ఇక ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ (13)ను త్వరగా పెవిలియన్‌కు పంపించాడు తుషార్ దేశ్‌పాండే. హెడ్‌కు మాజీ కెప్టెన్ ఎంస్ ధోనీ పక్కా స్కెచ్ గీశాడు. డారిల్ మిచెల్‌ను పక్కాగా ఫీల్డ్ సెట్ చేశాడు. రెండో ఐదో బంతిని స్లో చేసి కొంచెం వైడ్‌గా బౌల్ చేశాడు. ట్రావిస్ భారీ షాట్ ఆడేందుకు యత్నించగా.. డీప్ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ చేతికి దొరికిపోయాడు. ఈ బంతి వేయకముందు మిచెల్‌కు సిగ్నల్ ఇచ్చిన ధోని.. క్యాచ్ వస్తుందని కాస్త ముందుకు జరిగి ఉండాలని సూచించాడు. చెప్పినట్లుగా హెడ్ షాట్ ఆడడం.. మిచెల్ క్యాచ్ పట్టేయడం జరిగిపోయాయి. హెడ్ అవుట్ కావడంతో ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సీఎస్‌కే జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగినా షాడో కెప్టెన్‌గా ధోనీ వ్యవహరిస్తు యంగ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు అండగా నిలబడుతున్నాడు.
ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, నాలుగు ఓటములతో మూడోస్థానానికి చేరుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 విజయాలు, 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. టాప్ ప్లేస్‌లో రాజస్థాన్ రాయల్స్ (16) ఉండగా.. రెండోస్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (10) ఉంది. లక్నో (10) ఐదోస్థానంలో, ఢిల్లీ (10) ఆరోస్థానంలో ఉన్నాయి. గుజరాత్ (8) ఏడోస్థానంలో ఉండగా.. పంజాబ్, ముంబై, ఆర్‌సీబీ ఆరు పాయింట్లతో వరుసగా 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి.
Also Read: YS Jagan Convoy: కాన్వాయ్ కిందపడ్డ కుక్క.. చలించిపోయిన సీఎం వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter