Mitchell Starc: రూ.24 కోట్ల ప్లేయర్.. ఐపీఎల్‌లో ఉతికి ఆరేస్తున్న బ్యాట్స్‌మెన్.. స్టార్క్‌పై ట్రోలింగ్..!
Mitchell Starc in IPL 2024: ఈ సీజన్‌లో మిచెల్ స్టార్క్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పూర్తిగా తేలియాడు. బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు ఇవ్వడంతోపాటు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోవడంతో నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. రెండు మ్యాచ్‌ల్లో కలిపి 100 రన్స్ ఇచ్చాడు.
Mitchell Starc in IPL 2024: మిచెల్ స్టార్క్.. ఐపీఎల్ మినీ వేలం తరువాత క్రికెట్ ప్రపంచంలో మారుమోగిపోయింది ఈ పేరు. ఐపీఎల్ చరిత్రలో ఏ ఆటగాడికి దక్కని ప్రైజ్ మనీ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్‌కు దక్కింది. రూ.24.75 కోట్లకు వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు దక్కించుకుంది. అయితే ఐపీఎల్ ప్రారంభమైన తరువాత స్టార్క్‌పై ఉన్న అంచనాలు అన్ని తొలి రెండు మ్యాచ్‌ల్లో తలకిందులయ్యాయి. ఈ స్పీడ్ స్టార్ నుంచి ఇలాంటి పర్మామెన్స్ ఉంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. రెండు మ్యాచ్‌ల్లో మొత్తం 8 ఓవర్లు బౌలింగ్ చేసిన స్టార్క్.. మొత్తం 100 పరుగులు సమర్పించుకున్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ కలిపి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఎకానమీ రేటు ఓవర్‌కు 12.50 పరుగులుగా ఉంది.
కేకేఆర్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించినా.. స్టార్క్ బౌలింగ్ తీరుపట్ల మాత్రం నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. ఐస్‌లాండ్ క్రికెట్ కూడా స్టార్క్‌బౌలింగ్‌పై సెటైర్లు వేసింది. ఇది ఐస్‌లాండ్ బీర్ కంటే ఖరీదైనది అంటూ రాసుకొచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 53 పరుగులు ఇచ్చిన స్టార్క్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 47 పరుగులను ఇచ్చాడు.
శుక్రవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ మొదటి ఓవర్‌లో ఏడు పరుగులే ఇచ్చాడు. రెండో ఓవర్‌లో విరాట్ కోహ్లి ఒక సిక్స్, ఫోర్ బాది మొత్తం 17 పరుగులు పిండుకున్నాడు. మూడో ఓవర్‌లో ఏడు పరుగులు ఇవ్వగా.. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 16 పరుగులు సమర్పించుకున్నాడు. కోహ్లీ, దినేష్ కార్తీక్ చెరో సిక్సర్ బాదారు. ఐపీఎల్ 2014, 2015 సీజన్స్‌లో ఆర్‌సీబీ తరఫున ఆడిన స్టార్క్.. విరాట్ కోహ్లీ సారథ్యంలో 27 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 34 వికెట్లు తీశాడు. 2014 సీజన్‌లో అతను 14 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు, 2015లో 13 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు.
స్టార్క్‌తోపాటు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు ఐపీఎల్‌లో భారీ ధరనే దక్కింది. రూ.20.5 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ దక్కించుకుంది. అయితే తన ధరకు తగినట్లుగానే కమిన్స్ పర్మామెన్స్ ఉంటోంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్సీతోపాటు బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు కమిన్స్. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బౌలింగ్‌కు వచ్చి రోహిత్ శర్మ, తిలక్ వర్మలను ఔట్ చేసి.. మ్యాచ్‌ను ఎస్‌ఆర్‌హెచ్ వైపు మలుపు తిప్పాడు. డెత్ ఓవర్లలో కమిన్స్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఐపీఎల్‌లో ఇంకా మ్యాచ్‌లు జరగాల్సి ఉన్న నేపథ్యంలో స్టార్క్ కూడా పుంజుకుంటాడని కేకేఆర్ ఫ్యాన్స్ అంటున్నారు.
Also Read: Redmi Note 13 5G Price: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్స్..Redmi Note 13 5G మొబైల్‌ను రూ.800కే పొందండి!
Also Read: Heat Waves: రానున్న 3-4 రోజుల్లో ఈ జిల్లాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి