IPL 2024 Auction: క్రికెట్‌ను పూర్తిగా కమర్షియల్ చేసిన టోర్నీ ఐపీఎల్.  ఆటగాళ్లను వివిధ జట్లు వేలంలో కొనుక్కుంటాయి. ప్రతియేటా ఈ వేలం మారుతుంటుంది. కొంతమంది ఆటగాళ్లను ఆయా జట్లు కొనసాగించడం లేదా వదులుకోవడం చేస్తుంటాయి. లేదా స్వాపింగ్ ఉంటుంది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా విషయంలో అదే విన్ఫిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2024లో కీలక పరిణామం చోటుచేసుకోవచ్చు. ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వగానే టైటిల్ గెల్చిన గుజరాత్ టైటాన్స్ ఆయువుపట్టు టీమ్ ఇండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా గట్టు మారిపోవచ్చనే వార్తలు బలంగా విన్పిస్తున్నాయి. ఐపీఎల్ 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. ఈ వేలానికి ముందే ఆయా ఫ్రాంచైజీ జట్లు తమ తమ ఆటగాళ్లను కొనసాగించడం లేదా వదులుకోవడం చేస్తుంటాయి. ఆ జాబితా ఆధారంగా ఫ్రాంచైజీల వద్ద మిగిలిన వ్యాలెట్ ఆధారంగా వేలంలో ఆటగాళ్లను దక్కించుకుంటుంటారు. అదే సమయంలో ఫ్రాంజైజీల మధ్య పరస్పరం స్వాపింగ్ కూడా జరుగుతుంటుంది. ఐపీఎల్ 2024 వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు నవంబర్ 26లోగా అంటే రేపటిలోగా రిటెన్షన్ జాబితాను పంపించాల్సి ఉంటుంది. 


ఇప్పటికే ముగ్గురు ఆటగాళ్లు స్వాపింగ్ ద్వారా జట్టు మారిపోయారు. రొమారియో షెఫర్డ్ 50 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు మారాడు. దేవదత్ పడిక్కల్ 7.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు మారాడు. ఇక అవేష్ ఖాన్ 10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చేరాడు. 


అన్నింటికీ మించి ఓ వార్త ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో భారీగా ట్రేడ్ లేదా స్వాపింగ్‌గా పరిగణించే పరిణామం జరగనుంది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఒకసారి టైటిల్ అందించి రెండవసారి ఫైనల్‌కు చేర్చిన హార్దిక్ పాండ్యా విషయంలో వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. హార్దిక్ పాండ్యాను 15 కోట్లకు ముంబై ఇండియన్స్ చేజిక్కించుకోవచ్చని సమాచారం. అతడి స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు 8 కోట్లకు జోఫ్రా ఆర్చర్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఇవ్వనుందని తెలుస్తోంది. 2022 ఐపీఎల్ మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరిన హార్దిక్ పాండ్యా ఇప్పుడీ స్వాపింగ్ ప్రక్రియ పూర్తయితే తిరిగి ముంబై గూటికి చేరనున్నాడు. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావల్సి ఉంది.


Also read: Chennai Super Kings: ధోనీ ఫిట్‌నెస్‌పై ఆందోళన.. చెన్నై సూపర్ కింగ్స్‌ కొత్త కెప్టెన్‌గా యంగ్ ప్లేయర్..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook