IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం మొదటి రోజు హోరాహోరీగా సాగుతోంది. మొదటి రోజు అంతా స్టార్ ఆటగాళ్లే కావడంతో పోటీ తీవ్రంగా ఉంది. రికార్డు ధరలకు ఆటగాళ్లు అమ్ముడుపోతున్నారు. ఢిల్లీ కేపిటల్స్ మాజీ కెప్టెన్, ప్రస్తుతం టీమ్ ఇండియాలో దుమ్ము రేపుతున్న రిషభ్ పంత్ కోసం పోటీ తీవ్రంగా జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్రతం చెడినా ఫలితం దక్కాలంటారు. సరిగ్గా అలానే వ్యవహరించింది కావ్య పాప. రిషభ్ పంత్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చివరి నిమిషంలో తప్పుకుని వ్యాలెట్ సేవ్ చేసుకుంది. అటు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు వ్యాలెట్ చిల్లు పడేట్టు చేసింది. 2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెండేళ్ల క్రికెట్‌కు దూరమైన రిషభ్ పంత్ ఐపీఎల్ 2024తో మళ్లీ రంగ ప్రవేశం చేసి ఢిల్లీ కేపిటల్స్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. గత సీజన్‌లో 16 కోట్లకు ఢిల్లీ కేపిటల్స్ కొనుగోలు చేసింది.


ఈసారి వేలంలో దిగిన రిషభ్ పంత్‌పై అన్ని ఫ్రాంచైజీలు కన్నేశాయి. నాలుగు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. ప్రధానంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య తీవ్రంగా పోటీ సాగింది. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో ప్రారంభమై ఏకంగా 20 కోట్లకు చేరింది. ఓ దశలో లక్నో సూపర్ జెయింట్స్ పోటీ నుంచి తప్పుకుంటుందని భావించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కైవసం చేసుకుంటుందనుకున్నారు. వ్యాలెట్ 45 కోట్లే ఉండటం, ఇంకా స్లాట్స్ చాలా ఖాళీగా ఉండటంతో పోటీ నుంచి తప్పుకుంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ కైవసం చేసుకుంటుందనుకున్న తరుణంలో ఢిల్లీ కేపిటల్స్ జట్టు రైట్ టు మ్యాచ్ ఉపయోగించి మళ్లీ వేలంలో దిగింది. అయితే లక్నో ఏకంగా 6 కోట్లు పెంచి 27 కోట్లు చెప్పడంతో ఢిల్లీ తప్పుకుంది. 27 కోట్లు వ్యాలెట్ నుంచి ఖర్చవడంతో లక్నో సూపర్ జెయింట్స్ వద్ద ఇప్పుడు 18 కోట్లే మిగిలాయి. 


ఎందుకంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు వ్యాలెట్ వేలానికి ముందు 45 కోట్లే ఉంది. మొహమ్మద్ షమీని 10 కోట్లకు దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద ఇప్పుడింకా 35 కోట్లున్నాయి. 


Also read: IPL 2025 Mega Auction: ఐపీఎల్ వేలంలో చిత్రం, హైదరాబాదీ గుజరాత్‌కు..గుజరాతీ హైదరాబాద్‌కు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.