IPL 2024: ఐపీఎల్ లో సిక్సర్లు మోత మోగిస్తున్న తెలుగోడు.. 21 ఏళ్లకే అరుదైన రికార్డు..
IPL 2024: ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఐపీఎల్ లో సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. తాజాగా మనోడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన పేరిట ఓ రికార్డును లిఖించుకున్నాడు.
Tilak Varma IPL Records: తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఐపీఎల్ లో దుమ్మురేపుతున్నాడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న తిలక్..సీనియర్లు చేతులెత్తేసిన వేళ అద్భుతంగా ఆడి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ముఖ్యంగా మనోడు అలవోకగా సిక్సర్లు బాదేస్తున్నాడు. కేవలం 21 ఏళ్ల వయసులోనే 50 సిక్సర్లు కొటిట రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తొలి స్థానంలో రిషభ్ పంత్ ఉన్నాడు. పంత్ కూడా 21 ఏళ్ల వయసులో 94 సిక్సర్లు కొట్టాడు. మూడో స్థానంలో జైస్వాల్ ఉన్నాడు. అతడు 21 ఏళ్ల వయసులో 48 సిక్సర్లు బాదాడు.
పంజాబ్ పై తిలక్ మెరుపులు..
ఈ ఐపీఎల్ సీజన్ లో తిలక్ వర్మ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు తిలక్ 7 ఇన్నింగ్స్‌లలో 41.60 సగటుతో 208 పరుగులు చేశాడు, ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. గురువారం పంజాబ్ కింగ్స్‌పై ముంబై విజయం సాధించడంలో మనోడు కీ రోల్ ప్లే చేశాడు. తిలక్ వర్మ చివర్లో మెరుపులు మెరిపించి 34 పరుగులు చేయడంతోనే హార్దిక్ సేన పంజాబ్ కు 190 పరుగుల భారీ టార్గెట్ ను ఇవ్వగలిగింది. తిలక్ ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఐపీఎల్ కెరీర్ లో 32 మ్యాచులు ఆడిన తిలక్ నాలుగు హాఫ్ సెంచరీలతో 39.5 సగటు కలిగి 948 పరుగులు చేశాడు. టీమిండియా తరపున కూడా కొన్ని మ్యాచులు ఆడాడు.
ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రీవిస్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మాధ్వల్, విష్ణు వినోద్, రొమారియో షెపర్డ్, షామ్స్ ములానీ, నెహాల్ వధేరా, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మహ్మద్ నబీ, ల్యూక్ వుడ్
Also Read: IPL 2024 Updates: ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న ఆటగాళ్లు ఎవరో తెలుసా?
Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టు ఇదే.. వైరల్ అవుతున్న లిస్ట్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి