MI Vs RR Live Score: టాస్ గెలిచిన సంజూ శాంసన్.. ముంబై ఈ సారైనా బోణీ కొట్టేనా?
MI Vs RR Live Score: కీలకపోరుకు మరో కొద్ది క్షణాల్లో తెరలేవనుంది. వాంఖడే వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచింది. ఇరు జట్ల ఫ్లేయింగ్ 11 ఎలా ఉందో చూద్దాం.
IPL 2024, MI Vs RR Live Score: 17వ ఐపీఎల్ సీజన్ 14వ మ్యచ్‌లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ముందుగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పాండ్యా సేన గత మ్యాచులో ఆడిన జట్టుతోనే ఆడుతోంది. రాజస్థాన్ మాత్రం సందీప్ శర్మ స్థానంలో బర్గర్‌ను జట్టులోకి తీసుకుంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ రాజస్థాన్ గెలిచింది. ఈ మ్యాచ్ లోనే గెలిచి హ్యాట్రిక్ విజయాలను అందుకోవాలని చూస్తోంది. మరోవైపు ముంబై ఈసారైన బోణీ కొట్టాలని అనుకుంటుంది. అయితే వాంఖడే స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇదే సమయంలో కొంత స్పిన్నర్లకు అనుకూలిస్తుంది.
హెడ్ టు హెడ్ రికార్డులు:
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ముంబై, రాజస్థాన్ జట్లు మొత్తం 28 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఒక మ్యాచ్ టై అయింది. రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ చేసిన అత్యధిక స్కోరు 214 పరుగులు కాగా.. ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ అత్యధిక స్కోరు 212 పరుగులు.
ఇరు జట్ల ఫ్లేయింగ్ 11 ఇదే:
రాజస్థాన్ రాయల్స్ జట్టు:
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాంద్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్
ముంబై ఇండియన్స్ జట్టు:
ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధిర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జస్ప్రీత్ బుమ్రా, క్వెనా మఫాకా.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్‌కు ఝలక్.. చెన్నై విజయం సాధించిన వెంటనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook