PBKS vs GT Highlights: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో మరోసారి బౌలింగ్‌ పిచ్‌ మాయ చేసింది. పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌ పైచేయి సాధించగా.. నమోదైన తక్కువ స్కోర్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ పోరాడి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మూడు వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ విజయం సాధించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: RCB Fail: బెంగళూరుకు ఈసారి 'కప్‌' దూరమే! కోహ్లీకి ఇక మిగిలింది తీవ్ర నిరాశే


టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేసి కుప్పకూలింది. ఓపెనర్లుగా దిగిన కెప్టెన్‌ సామ్‌ కురాన్‌ (20), ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌ (35) పరుగులతో నామమాత్ర ప్రదర్శన చేశారు. పవర్‌ ప్లేను ఏ ఆటగాడు సక్రమంగా వినియోగించుకోలేదు. అనంతరం వచ్చిన బ్యాటర్లంతా తక్కువ పరుగులు చేస్తూ పెవిలియన్‌ బాట పట్టారు. రిలీ రూసో (9), జితేష్‌ శర్మ (13), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (6), శశాంక్‌ సింగ్‌ (8), అశుతోష్‌ శర్మ (3), హర్‌ప్రీత్‌స ఇంగ్‌ భటియా (14), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (29), హర్షల్‌ పటేల్‌ (0) బ్యాట్‌ను ఝులిపించడంలో విఫలమయ్యారు.

పంజాబ్‌ను పరుగులు చేయకుండా  గుజరాత్‌ బౌలర్లు నియంత్రించారు. రవిశ్రీనివాసన్‌ సాయి కిశోర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మోహిత్‌ శర్మ, నూర్‌ అహ్మద్‌ రెండు చొప్పున వికెట్లు తీయగా.. రషీద్‌ ఖాన్‌ ఒక వికెట్‌కే పరిమితమయ్యాడు.

Also Read: DC vs SRH Highlights: సన్‌రైజర్స్‌ మరో సంచలన విజయం.. ఢిల్లీని మడతబెట్టిన నటరాజన్‌


అతి స్వల్ప స్కోర్‌ను ఛేదించడానికి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ కష్టపడే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 19.1 ఓవర్లలో 146 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆశాకిరణంలా వచ్చిన రాహుల్‌ తెవాటియా (36) గొప్పగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ 35 పరుగులతో పరవాలేదనిపించాడు. సాయి సుదర్శన్‌ 31తో విలువైన పరుగులు చేశాడు. వీరు ముగ్గురు మినహా ఎవరూ కూడా మోస్తరు స్కోర్‌ నమోదు చేయలేదు. ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహ (13), డేవిడ్‌ మిల్లర్‌ (4), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (13), షారూఖ్‌ ఖాన్‌ (8), రషీద్‌ ఖాన్‌ (3) కొంత స్కోర్‌ సాధించారు.



ఆఖరు దాకా పోరాటం
చేసిన తక్కువ స్కోర్‌ను కాపాడుకునేందుకు పంజాబ్ బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. కానీ ఆఖర్లో రబాడ ఓవర్‌తో మ్యాచ్‌ చేజారింది. హర్షల్‌ పటేల్‌ 3 వికెట్లు తీసి సత్తా చాటగా.. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ 2 వికెట్లు పడగొట్టాడు. సామ్‌ కరాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌తో నాలుగో విజయం సాధించి గుజరాత్‌ పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లు వేసుకుని.. ఆరో స్థానంలో నిలిచింది. పంజాబ్‌ కింగ్స్‌ ఆరో ఓటమితో ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter