IPL 2024 Points table updated: ఈసారి ఐపీఎల్ సీజన్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. బ్యాట్, బంతి మధ్య ఆసక్తికర పోరు క్రికెట్ లవర్స్ ను అలరిస్తుంది. జట్లన్నీ నువ్వా-నేనా అన్నరీతిలో తలపడుతున్నాయి. రోజురోజుకు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో స్థానాలు మారుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు అట్టడుగున ఉన్న ముంబై మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది. పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ స్థానాలు దిగజారాయి. ఢిల్లీ చివరి స్థానంలో కొనసాగుతోంది. అయితే పాయింట్ల టేబుల్ లో ఏ జట్టు ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అగ్రస్థానంలో రాజస్థాన్..
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఎప్పటిలాగే రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఐదు మ్యాచుల్లో నాల్గింటిలో గెలిచి ఎనిమిది పాయింట్లతో +0.871 రన్‌రేట్‌తో తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ టీమ్ ఉంది. ఆ జట్టు నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచి ఆరు పాయింట్లతో 1.528 రన్‌రేట్‌తో కొనసాగుతుంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒకటి ఓడి మూడింటిలో గెలిచిన లక్నో మూడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు ఆరు పాయింట్లతో +0.775 రన్‌రేట్‌తో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఐదింటిలో మూడు గెలిచి మూడు పాయింట్లతో +0.666 రన్‌రేట్‌తో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.


అట్టడగున ఢిల్లీ..
ఇక మన తెలుగు టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదు మ్యాచుల్లో మూడు గెలిచి ఆరు పాయింట్లతో +0.344 రన్‌రేట్‌తో ఐదో స్థానంలో కొనసాగుతోంది. గిల్ నేతృత్వంలోని గుజరాత్ ఆరు మ్యాచుల్లో మూడు గెలిచి ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. గురువారం ఆర్సీబీని ఓడించడం ద్వారా ముంబై ఇండియన్స్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఆ జట్టు ఐదు మ్యాచుల్లో రెండు విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన ఐదు మ్యాచుల్లో రెండు గెలిచిన పంజాబ్ ఎనిమిదో ఫ్లేస్ లో ఉండగా.. ఆరు మ్యాచుల్లో ఒకటి మాత్రమే గెలిచిన ఆర్సీబీ తొమ్మిది స్తానంలో కొనసాగుతోంది. ఇక అట్టడుగున ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఆ జట్టు ఐదు మ్యాచుల్లో ఒకటి మాత్రమే గెలిచి ఆఖరి స్థానంలో నిలిచింది. 


Also read: Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్ అంటే బ్యాటర్లు ఎందుకు భయపడతారు? సీక్రెట్ రివీల్ చేసిన యార్కర్ కింగ్..


Also Read: IPL Live Score 2024 MI vs RCB: ఓటమికి కేరాఫ్‌గా బెంగళూరు.. సిక్సర్ల సునామీతో ముంబై ఇండియన్స్‌ భారీ విజయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook