IPL 2024 Points table: చెన్నైను కొట్టి టాప్-5లోకి సన్ రైజర్స్... అగ్రస్థానం ఎవరిదంటే?
IPL 2024 live: ఈసారి ఐపీఎల్ సీజన్ మస్తు మజాను ఇస్తోంది. రోజుకో ట్విస్ట్ తో ఈ మెగా టోర్నీ జరుగుతోంది. నిన్న సన్ రైజర్స్ చెన్నైను చావు దెబ్బ కొట్టడంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
IPL 2024 Points table updated: ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దెబ్బకు పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ టాప్ ఫ్లేస్ లో కొనసాగుతోంది. ఆరు పాయింట్లు సాధించిన ఆ జట్టు +2.518 నెట్ రన్ రేట్ తో అగ్రస్థానంలో ఉంది. సంజూ శాంసన్ నేతృత్వంలోని జస్థాన్ రాయల్స్ జట్టు కూడా తొలి మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. అన్నే పాయింట్లతో +1.249 నెట్ రన్‌రేట్‌ను కలిగి రెండో స్థానంలో ఉంది.
టాప్-5లోకి సన్ రైజర్స్
అయితే శుక్రవారం ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్ ఓడినప్పటికీ మూడో స్థానంలోనే ఉంది. ఆ జట్టు ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండింటిలో గెలిచి నాలుగు పాయింట్లతో +0.517 రన్‌రేట్‌ను కలిగి ఉంది. ఇక పోతే నాలుగో స్థానంలో రాహుల్ సారథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఉంది. ఆ జట్టు మూడు మ్యాచుల్లో రెండు గెలిచి 4 పాయింట్లతో +0.483 రన్ రేట్ ను సాధించింది. అయితే చెన్నైతో మ్యాచ్ లో గెలవడం ద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదో స్థానానికి ఎగబాకింది. కమిన్స్ జట్టు నాలుగు మ్యాచుల్లో రెండింటిలో గెలిచి నాలుగు పాయింట్లతో +0.409 నెట్ రన్‌రేట్‌ను కలిగి టాప్-5 స్థానాన్ని దక్కించుకుంది.
అట్టడుగున ముంబై..
గుజరాత్ పై భారీ లక్ష్యాన్ని సైతం ఛేదించిన పంజాబ్ కింగ్స్ ఆరో ఫ్లేస్ లో కొససాగుతోంది. ఆ జట్టు నాలుగు మ్యాచుల్లో రెండింటిలో నెగ్గింది. ఇక అదే పంజాబ్ చేతిలో చావు దెబ్బతిన్న గుజరాత్ టైటాన్స్ ఏడో స్థానంలో ఉంది. ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. చివరి స్థానంలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓడిన ముంబై ఇండియన్స్ ఉంది. మరోవైపు ఇవాళ రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ మధ్య కీలక మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో రాయల్స్ గెలిస్తే టాప్ ఫ్లేస్ దక్కించుకునే అవకాశం ఉంది. ఒక వేళ ఆర్సీబీ గెలిస్తే తన స్థానం మరింత మెరుగయ్యే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి