RCB vs SRH Highlights: అత్యధిక స్కోర్లతో చరిత్ర రికార్డులు తిరగరాస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు బెంగళూరు భారీ షాక్‌ ఇచ్చింది. హైదరాబాద్‌ జైత్రయాత్రకు బ్రేక్‌లు వేస్తూ.. తమ ఓటముల పరంపరకు బెంగళూరు ఒక విరామం ఇచ్చింది. ఐపీఎల్‌లో తిరుగులేని జట్టుగా రాణిస్తోందని చర్చ నడుస్తున్న సమయంలోనే హైదరాబాద్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమిపాలైంది. 35 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై బెంగళూరు విజయం సాధించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IPL 2024 Live RR vs MI : ఐపీఎల్‌లో తిరుగులేని రారాజు 'రాజస్థాన్‌'.. యశస్వి జైస్వాల్‌ దెబ్బకు ముంబై ఓటమి


 


మొదట బ్యాటింగ్‌కు వెళ్తే సన్‌రైజర్స్‌ పరుగుల వరద పారిస్తుందని ముందే గ్రహించిన కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగాడు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (51), రజత్‌ పాటిదార్‌ (50) అర్థ శతకాలతో రాణించారు. కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (25), కామెరూన్‌ గ్రీన్‌ (37) బ్యాటింగ్‌తో పర్వాలేదనిపించగా.. విల్‌ జాక్స్‌ (6),  మహీపాల్‌ లమ్రోర్‌ (7), దినేశ్‌ కార్తీక్‌ (11), స్వప్నిల్‌ సింగ్‌ (12) తలా కొంత పరుగులు రాబట్టారు. బెంగళూరు బ్యాటర్లను హైదరాబాద్‌ బౌలర్లు కొంత కట్టడి చేస్తూనే బౌలింగ్‌ చేశారు. జయదేవ్‌ ఉనద్కట్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు. నటరాజన్‌ 2 వికెట్లు తీయగా.. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ మాత్రం 55 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. మయాంక్‌ మన్కడే కూడా మరో వికెట్‌ పడగొట్టాడు.

Also Read: RCB IPl 2024 Play Off Chances: బెంగళూరుకు ఈసారి 'కప్‌' దూరమే! కోహ్లీకి ఇక మిగిలింది తీవ్ర నిరాశే


 


అత్యధిక పరుగులు సాధించడం అలవాటుగా చేసుకున్న హైదరాబాద్‌ ముందు సాధారణ లక్ష్యమే ఉంది. ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులకు పరిమితమైంది. శతకాలతో బెంబేలెత్తిస్తున్న ట్రావెస్‌ హెడ్‌ ఒక్క పరుగుకే ఔటవడం అందరికీ షాకింగ్‌గా మిగిల్చింది. అనంతరం టపటపా వికెట్లు పడ్డాయి. ఐడెన్‌ మర్క్‌క్రమ్‌ (7), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (13), అబ్దుల్‌ సమద్‌ (10), భువనేశ్వర్‌ కుమార్‌ (13) పరుగులు రాబట్టడంలో ఘోరంగా విఫలమయ్యారు. అభిషేక్‌ శర్మ సాధించిన 31 పరుగులే అత్యధిక స్కోర్‌ కావడం గమనార్హం. షాబాజ్‌ అహ్మద్‌ మాత్రం జట్టు విజయం కోసం తీవ్రంగా కృషి చేశాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో వచ్చిన షాబాజ్‌ 40 పరుగులు చేసి గొప్పగా పోరాడాడు. అతడి పోరాటంతో ఓటమి అంతరం తగ్గడం విశేషం.

బౌలింగ్‌ వైఫల్యంతో తీవ్ర విమర్శల పాలవుతున్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో మాత్రం అద్భుతంగా ఆడింది. బెంగళూరు బౌలర్లు బంతితో మ్యాజిక్‌ చేసి హైదరాబాద్‌ను కుప్పకూల్చారు. తొలి ఓవర్‌ నుంచే ఎదురుదాడి చేసి భారీ దెబ్బతీశారు. స్వప్నిల్‌ సింగ్‌, కర్ణ్‌ శర్మ, కామెరూన్‌ గ్రీన్‌ రెండు వికెట్ల చొప్పున తీసి జట్టుకు విజయాన్నందించారు. యశ్‌ దయాల్‌, విల్‌ జాక్స్‌ ఒక్కో వికెట్‌ తీశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter